Nokia C12 Plus: కేవలం రూ. 7,999కే స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..

|

Apr 04, 2023 | 2:30 PM

నోకియా సీ12 ప్లస్ ఫోన్ 2జీబీ ర్యామ్ 32జీబీ ఆన్‌ బోర్డ్ స్టోరేజీని కలిగి ఉంది. డ్యూయల్ సిమ్ కనెక్టివిటీ, ఎక్స్‌ పాండబుల్ స్టోరేజ్, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, 8-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా వంటి ఫీచర్లతో వస్తోంది. దీని ధర బడ్జెట్ లెవెల్ లోనే ఉంటుంది.

Nokia C12 Plus: కేవలం రూ. 7,999కే స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే..
Nokia C12 Plus
Follow us on

నోకియా.. ఒకప్పుడు ఫోన్ అంటే అందరికీ ఈ పేరే గుర్తుకువచ్చేది. అయితే ఆండ్రాయిడ్ ప్రభంజనంలో నోకియా హ్యాండ్ సెట్లు కనుమరుగయ్యాయి. అయితే ఆ తర్వాత తేరుకున్న నోకియా కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ చేసినా అవి పెద్దగా క్లిక్ అవ్వలేదు. మార్కెట్లో పోటీ దారులతో నిలబడలేకపోయాయి. ఇప్పుడు మరో సారి నోకియా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ఎంట్రీ లెవల్ లో నోకియా స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. నోకియా సీ12 ప్లస్ పేరుతో దీనిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ 2జీబీ ర్యామ్ 32జీబీ ఆన్‌ బోర్డ్ స్టోరేజీని కలిగి ఉంది. డ్యూయల్ సిమ్ కనెక్టివిటీ, ఎక్స్‌ పాండబుల్ స్టోరేజ్, 4,000ఎంఏహెచ్ బ్యాటరీ, 8-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెన్సార్ మోడల్ ను కలిగి ఉంది. ఇంకా దీనికి సంబంధించిన ఫీచర్లు, ధర వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హెచ్ఎండీ గ్లోబల్ యాజమాన్యంలోని నోకియా , భారత్‌లో స్మార్ట్‌ఫోన్ రేంజ్‌ను విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇండియన్ మార్కెట్‌లోకి నోకియా సీ12 ప్లస్‌ ఎంట్రీ-లెవల్ ఫోన్‌ను కంపెనీ రిలీజ్ చేసింది.

డిస్ ప్లే.. ఈ ఫోన్ 720×1520 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 6.3 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. దీంట్లో వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్ ఫ్రంట్ హౌసింగ్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్ వెనుకవైపు ఎల్ఈడీ ఫ్లాష్ తో కూడిన 8ఎంపీ కెమెరా, ముందు వైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5ఎంపీ కెమెరా వస్తోంది.

ఇవి కూడా చదవండి

సామర్థ్యం.. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 గో ఎడిషన్‌తో రన్ అవుతుంది. అలాగే ఇది 1.6Hz క్లాక్ ఫ్రీక్వెన్సీ యునిసోక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 4,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 2జీబీ ర్యామ్ తో వస్తుంది. డివైజ్‌ ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ 32GB వరకు ఉంటుంది.

కనెక్టివిటీ.. ఈ డివైజ్ వైఫై, బ్లూటూత్, మైక్రో యూఎస్బీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లతో వస్తుంది.

ధర.. నోకియా సీ12 ప్లస్ ఫోన్ 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. లైట్ మింట్, చార్‌కోల్, డార్క్ సియాన్ కలర్ ఆప్షన్స్‌లో లభించే ఈ హ్యాండ్‌సెట్ ధర రూ.7,999గా కంపెనీ నిర్ణయించింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..