AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.2.15 లక్షల ఆఫర్‌ ప్రకటించిన మారుతీ సుజుకీ! కొత్త కార్‌ కొనేవారికి పండగే!

మారుతి సుజుకి ఏప్రిల్ 2026లో తన ప్రీమియం నెక్సా మోడళ్లపై భారీ ఆఫర్లను ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది. ఇగ్నిస్, బలినో, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, జిమ్మీ, XL6, ఇన్విక్టో వంటి మోడళ్లపై ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి.

రూ.2.15 లక్షల ఆఫర్‌ ప్రకటించిన మారుతీ సుజుకీ! కొత్త కార్‌ కొనేవారికి పండగే!
Invicto
SN Pasha
|

Updated on: Apr 17, 2026 | 8:11 AM

Share

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ ఇండియా ఏప్రిల్ 2026లో వినియోగదారులను ఆకర్షించేందుకు తన ప్రీమియం నెక్సా లైనప్‌పై భారీ ఆఫర్లను ప్రకటించింది. కంపెనీ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ నెలాఖరు వరకు నెక్సా మోడళ్లపై గరిష్టంగా రూ.2.15 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లు ముఖ్యంగా ప్రీమియం సెగ్మెంట్ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని తీసుకువచ్చినవి. ఈ ఆఫర్ల పరిధిలో మారుతి సుజుకి ఇగ్నిస్‌పై రూ.50,000 వరకు, బలినోపై రూ.40,000 వరకు, ఫ్రాంక్స్‌పై రూ.55,000 వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. అదే విధంగా గ్రాండ్‌ వింటారాపై రూ.1.07 లక్షల వరకు, జిమ్మీపై రూ.50,000 వరకు, XL6పై రూ.50,000 వరకు ఆఫర్లు ఉన్నాయి. ఈ జాబితాలో అత్యధిక ప్రయోజనం మారుతి సుజుకి ఇన్విక్టోపై లభిస్తోంది, దీనిపై గరిష్టంగా రూ.2.15 లక్షల వరకు మొత్తం ఆఫర్లు అందిస్తున్నారు.

ఈ ప్రయోజనాల్లో కన్స్యూమర్ ఆఫర్లు, డీలర్ ప్రత్యేక డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ బోనస్, లాయల్టీ అప్‌గ్రేడ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు వంటి అనేక లాభాలు ఉన్నాయి. అయితే ఈ ఆఫర్లు వాహనం వేరియంట్, నగరం, డీలర్‌షిప్ ఆధారంగా మారే అవకాశం ఉందని కంపెనీ సూచిస్తోంది. FY26లో కంపెనీ కనబరిచిన బలమైన పనితీరు కూడా ఈ ఆఫర్లకు ఒక కారణంగా భావిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్లో 18.23 లక్షల ప్యాసింజర్ వాహనాల అమ్మకాలతో 3.54 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మార్కెట్ షేర్‌ను మరింత పెంచుకోవడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

మారుతి సుజుకి తన కార్లను నెక్సా, ఎరీనా అనే రెండు వేర్వేరు చానళ్ల ద్వారా విక్రయిస్తుంది. నెక్సా మోడళ్లు ప్రీమియం కేటగిరీకి చెందినవిగా ఉండగా, ఎరీనా మోడళ్లు సాధారణ వినియోగదారులను లక్ష్యంగా ఉంచుతాయి. ఇదే సమయంలో కంపెనీ తన ఎరీనా శ్రేణి వాహనాలపై కూడా ఏప్రిల్ నెలలో రూ.45,000 వరకు ఆఫర్లను అందిస్తోంది. మొత్తంగా పండుగ సీజన్ కాకపోయినా వినియోగదారులను ఆకర్షించేందుకు కంపెనీ ముందుగానే భారీ డిస్కౌంట్లతో మార్కెట్లో పోటీని మరింత పెంచుతోంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us