Snapchat: స్నాప్‌చాట్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..! అదిరిపోయే ఫీచర్‌ వచ్చేసింది.. ఇకపై..

స్నాప్‌చాట్ తన కొత్త 'క్విక్ కట్' ఫీచర్‌ను పరిచయం చేసింది, ఇది యాప్‌లోనే తక్షణ వీడియో సృష్టిని సులభతరం చేస్తుంది. ఈ లెన్స్-ఆధారిత సాధనం వినియోగదారులు మెమోరీస్ నుండి ఫోటోలు, క్లిప్‌లను ఎంచుకుని, కొన్ని సెకన్లలో బీట్-సింక్డ్ వీడియోలను స్వయంచాలకంగా రూపొందించడానికి అనుమతిస్తుంది.

Snapchat: స్నాప్‌చాట్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..! అదిరిపోయే ఫీచర్‌ వచ్చేసింది.. ఇకపై..
Snapchat

Updated on: Dec 18, 2025 | 7:08 PM

ప్రముఖ ఇన్‌స్టంట్ ఫోటో అండ్‌ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన స్నాప్‌చాట్, క్విక్ కట్ అనే కొత్త లెన్స్-ఆధారిత వీడియో క్రియేట్‌ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇది యాప్ నుండే నేరుగా చిన్న వీడియోలను క్రియేట్‌ చేయడాన్ని ఈజీ చేస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులు మెమోరీస్ నుండి ఫోటోలు, క్లిప్‌లను కొన్ని సెకన్లలో బీట్-సింక్డ్ వీడియోలుగా మార్చడానికి వీలు కల్పిస్తుంది. ఈ క్విక్ కట్‌ను రోజువారీ క్షణాల కోసం అలాగే స్పాట్‌లైట్ కంటెంట్ సృష్టి కోసం రూపొందించామని కంపెనీ తెలిపింది.

క్విక్ కట్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?

క్విక్ కట్ వీడియో ఎడిటింగ్‌ను సులభతరం చేస్తుంది. ఇది మల్టీ ఫోటోలు లేదా వీడియో క్లిప్‌లను ఎంచుకుంటుంది, రెడీమేడ్ వీడియో ఇన్‌స్టంట్‌ ప్రివ్యూతో వస్తుంది. వినియోగదారులు క్లిప్‌లను మాన్యువల్‌గా సవరించాల్సిన అవసరం లేదు లేదా అమర్చాల్సిన అవసరం లేదు. వినియోగదారులు తమ మీడియాను ఎంచుకుంటారు, స్నాప్‌చాట్ స్వయంచాలకంగా వీడియోను సృష్టిస్తుంది.

మెమరీస్, కెమెరా రోల్‌కి సులువుగా యాక్సెస్ ఉంటుంది. ఆటోమేటిక్ మ్యూజిక్, లెన్స్ సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. క్విక్ కట్ స్వయంచాలకంగా స్నాప్‌చాట్ సౌండ్స్ లైబ్రరీ నుండి మ్యూజిక్ ట్రాక్‌ను యాడ్‌ చేస్తుంది, ఎంచుకున్న క్లిప్‌లతో మ్యాచ్‌ చేస్తుంది.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి