Boat Enigma Smartwatch: మరో నయా స్మార్ట్‌ వాచ్‌ రిలీజ్‌ చేసిన బోట్‌..స్టైలిష్‌ లుక్‌తో స్టన్నింగ్‌ ఫీచర్స్‌

| Edited By: TV9 Telugu

Dec 28, 2023 | 6:59 PM

గతంలో కేవలం తక్కువ ధరల్లోనే వాచ్‌లు రిలీజ్‌ చేసిన కంపెనీలు ప్రస్తుతం కాస్త ధర పెంచి ప్రీమియం లుక్‌తో స్మార్ట్‌వాచ్‌లను రిలీజ్‌ చేస్తున్నాయి. గత సెప్టెంబర్‌లో బోట్‌ కంపెనీ భారతదేశంలో ప్రీమియం మెటల్‌ డిజైన్తో ఎనిగ్మా సిరీస్‌ స్మార్ట్‌ వాచ్‌లను ప్రకటించింది. ఈ వాచ్‌లు మార్చుకోగలిగే స్ట్రాప్ బాడీతో ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌వాచ్‌ల సిరీస్‌లో భాగంగా బోట్‌ ఎనిగ్మా స్విచ్‌ పేరుతో కొత్త స్మార్ట్‌ వాచ్‌ను బోట్‌ కంపెనీ రిలీజ్‌ చేసింది.

Boat Enigma Smartwatch: మరో నయా స్మార్ట్‌ వాచ్‌ రిలీజ్‌ చేసిన బోట్‌..స్టైలిష్‌ లుక్‌తో స్టన్నింగ్‌ ఫీచర్స్‌
Boat Engima Switch Smart Watch
Follow us on

ప్రస్తుత రోజుల్లో యువత ఎక్కువగా స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కునిపోతున్నారు. స్మార్ట్‌ఫోన్‌ మాత్రమే కాకుండా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్‌ చేసుకుని వాడే బ్లూటూత్‌ యాక్ససరీస్‌పై కూడా ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ముఖ్యంగా బ్లూటూత్‌ సాయంతో పని చేసే స్మార్ట్‌ వాచ్‌లను అమితంగా వాడుతున్నారు. కంపెనీలు కూడా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్‌వాచ్‌లను రిలీజ్‌ చేస్తున్నాయి. గతంలో కేవలం తక్కువ ధరల్లోనే వాచ్‌లు రిలీజ్‌ చేసిన కంపెనీలు ప్రస్తుతం కాస్త ధర పెంచి ప్రీమియం లుక్‌తో స్మార్ట్‌వాచ్‌లను రిలీజ్‌ చేస్తున్నాయి. గత సెప్టెంబర్‌లో బోట్‌ కంపెనీ భారతదేశంలో ప్రీమియం మెటల్‌ డిజైన్తో ఎనిగ్మా సిరీస్‌ స్మార్ట్‌ వాచ్‌లను ప్రకటించింది. ఈ వాచ్‌లు మార్చుకోగలిగే స్ట్రాప్ బాడీతో ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌వాచ్‌ల సిరీస్‌లో భాగంగా బోట్‌ ఎనిగ్మా స్విచ్‌ పేరుతో కొత్త స్మార్ట్‌ వాచ్‌ను బోట్‌ కంపెనీ రిలీజ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ వాచ్‌ ధర, స్పెసిఫికేషన్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

బోట్ ఎనిగ్మా స్విచ్ ఫీచర్లు

బోట్‌ బ్రాండ్ ఎనిగ్మా స్విచ్ రౌండ్‌ డయల్‌తో 1.39 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఈ వాచ్‌ ప్రీమియం మెటల్ బాడీ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఈ వాచ్‌ ఫంక్షనల్ క్రౌన్‌ను కలిగి ఉంటుంది. ఈ వాచ్‌ ప్రాథమిక వాచ్ మాడ్యూల్‌లా ఉంటుంది. కాబట్టి మీరు మరింత సొగసైన రూపం కోసం స్టీల్ బాడీ మధ్య మారవచ్చు లేదా మరింత స్పోర్టీ మరియు ఫంక్షనల్ ఉపయోగం కోసం సిలికాన్ పట్టీలకు మారవచ్చు. బోట్ ఎనిగ్మా స్విచ్ బ్లూటూత్ కాలింగ్‌ను కూడా కలిగి ఉంది. ఇది అంతర్నిర్మిత డయల్‌ప్యాడ్, సేవ్ కాంటాక్ట్‌లకు మద్దతు ఇస్తుంది. ఇది 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లకు మద్దతుతో వస్తుంది. అలాగే ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్‌ వివిధ ఆరోగ్య సంబంధిత సెన్సార్‌లను కూడా కలిగి ఉంది. అలాగే ఈ వాచ్‌లో హృదయ స్పందన సెన్సార్, ఎస్‌పీఓ2, బ్లడ్ ఆక్సిజన్ మ్యాపింగ్, స్లీప్ మానిటరింగ్, డైలీ యాక్టివిటీ ట్రాకర్, గైడెడ్ బ్రీతింగ్ ఉన్నాయి. వాయిస్ అసిస్టెంట్, ఫైండ్ మై ఫోన్, స్మార్ట్ నోటిఫికేషన్‌లు, సంగీతం, కెమెరా నియంత్రణలు, అలారాలు వంటి మరెన్నో ఫీచర్లు 

బోట్ ఎనిగ్మా స్విచ్ ధర

బోట్‌ తాజా స్మార్ట్‌వాచ్ మోడల్ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,999కు జాబితా చేశారు. అయితే ఆఫర్లన్నింటితో కలిపి ఈ వాచ్‌ను కేవలం రూ.3,799 సొంతం చేసుకోవచ్చని తెలుస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ వాచ్‌ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..