Fire-Boltt Smartwatch: స్మార్ట్ వాచ్‌లలో ‘రాక్’స్టార్ ఇది.. 110కి పైగా స్పోర్ట్స్ మోడ్లు, తిరుగులేని ఫీచర్లు..

|

Apr 11, 2023 | 5:30 PM

ఫైర్ బోల్ట్ సంస్థ ఫైర్ బోల్ట్ రాక్ పేరిట కొత్త స్మార్ట్ వాచ్ ను మార్కెట్లో విడుదల చేసింది. దీనికి సంబంధించిన సేల్స్ కూడా ప్రారంభించింది. దీనిలో అమోల్డ్ డిస్ ప్లే తో పాటు బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

Fire-Boltt Smartwatch: స్మార్ట్ వాచ్‌లలో ‘రాక్’స్టార్ ఇది.. 110కి పైగా స్పోర్ట్స్ మోడ్లు, తిరుగులేని ఫీచర్లు..
Fire Boltt Rock Smart Watch
Follow us on

మార్కెట్లో స్మార్ట్ ఫోన్ కు ఎంత డిమాండ్ ఉంటుందో.. అదే లెవెల్లో స్మార్ట్ వాచ్ కు కూడా డిమాండ్ ఏర్పడుతోంది. గతంలో ఎన్నడూ లేనతంగా అందరూ స్మార్ట్ వాచ్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అందుకు ప్రధాన కారణం స్మార్ట్ వాచ్ లలో ఉంటున్న అదనపు ఫీచర్లే. ఈ డిమాండ్ ను అందిపుచ్చుకునేందుకు అన్ని సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ పోటీలో దేశీయ సంస్థ ఫైర్ బోల్ట్ ముందంజలో ఉంది. పలు రకాల మోడళ్లను అనువైన బడ్జెట్లో అందిస్తూ ఆకట్టుకుంటోంది. ఇదే క్రమంలో మరో స్మార్ట్ వాచ్ ను లాంచ్ చేసింది. ఫైర్ బోల్ట్ రాక్ పేరిట దీనిని మార్కెట్లో విడుదల చేసింది. దీనికి సంబంధించిన సేల్స్ కూడా ప్రారంభించింది. దీనిలో అమోల్డ్ డిస్ ప్లే తో పాటు బ్లూటూత్ కాలింగ్, వాయిస్ అసిస్టెంట్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్ వాచ్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లుక్, డిజైన్.. ఈ ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్ వాచ్ రౌండ్ డైల్ ఉంది. ఇది అమోల్డ్ డిస్ ప్లే తో వస్తుంది. 1.3 అంగుళాల రౌండ్ షేప్ లో ఉంటుంది. ఈ డిస్‍ప్లేకు గ్లాస్ కవర్ ఉంటుంది. 550 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, ఆల్వేస్ ఆన్ డిస్‍ప్లే ఫీచర్‌తో ఈ వాచ్ వస్తోంది. మెటల్ బటన్, క్రౌన్ ఈ వాచ్‍కు ఉంటాయి. కస్టమైజబుల్ వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉంటాయి.

ఫీచర్లు.. స్లీప్ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటరింగ్, ఎస్‍పీఓ2 మానిటరింగ్ హెల్త్ ఫీచర్లతో ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్‌వాచ్ వచ్చింది. 110కి పైగా స్పోర్ట్స్ మోడ్‍లకు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ద్వారా మొబైల్‍కు కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. డయల్ ప్యాడ్ ఫీచర్ ఉంటుంది. ఈ వాచ్‍లో కాల్ లాగ్స్ కూడా చూడవచ్చు. మొబైల్‍కు కనెక్ట్ అయి ఉన్నప్పుడు వాచ్‍కే నోటిఫికేషన్లు వస్తాయి. మ్యూజిక్ ప్లే బ్యాక్‍ను కంట్రోల్ చేయవచ్చు. కాంటాక్టులు సింక్ చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్‍కు కూడా ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

సామర్థ్యం.. ఈ వాచ్‍లో 260ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఫుల్ చార్జ్‌పై ఈ వాచ్ 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుందని ఫైర్ బోల్ట్ పేర్కొంది. అదే స్టాడ్ బై లో అయితే 15 రోజుల పాటు బ్యాటరీ ఉంటుంది. వాటర్ రెసిస్టెంట్ కోసం ఐపీ68 రేటింగ్‍ను ఈ వాచ్ కలిగి ఉంది.

ధర, లభ్యత.. ఈ ఫైర్ బోల్ట్ రాక్ స్మార్ట్ వాచ్ ధర రూ.2,799గా ఉంది. ఈ-కామర్స్ ప్లాట్‍ఫామ్ ఫ్లిప్‍కార్ట్‌లో ఈ వాచ్ సేల్‍కు అందుబాటులో ఉంది. గోల్డ్, గ్రే, బ్లాక్ కలర్ ఆప్షన్‍లలో లభిస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..