Smart Watch: 14 రోజుల బ్యాటరీ లైఫ్‌తో సూపర్ స్మార్ట్‌వాచ్‌ వాచ్ రిలీజ్.. ధర ఎంతో తెలిస్తే షాక్..!

భారతదేశంలో ఇటీవల కాలంలో యువత ఎక్కువగా స్మార్ట్ యాక్ససరీస్ వాడకాన్ని ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లకు ఈ యాక్ససరీస్‌ను కనెక్ట్ చేసే సదుపాయం ఉండడంతో నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు వీటిని వాడుతున్నారు. కాబట్టి ఇండియాలో స్మార్ట్ వాచ్‌లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ అమేజ్‌ఫిట్ సూపర్ స్మార్ట్ వాచ్‌ను రిలీజ్ చేసింది.

Smart Watch: 14 రోజుల బ్యాటరీ లైఫ్‌తో సూపర్ స్మార్ట్‌వాచ్‌ వాచ్ రిలీజ్.. ధర ఎంతో తెలిస్తే షాక్..!
Amazfit Bip 6

Updated on: May 17, 2025 | 4:15 PM

అమేజ్ ఫిట్ కంపెనీ బిప్ సిరీస్‌లో కంపెనీ తాజా స్మార్ట్‌వాచ్ అయిన బిప్ 6ను ఇటీవల విడుదల చేసింది. ఈ వాచ్ 2,000 నిట్‌ల వరకు గరిష్ట ప్రకాశంతో కూడిన పెద్ద 1.97 అంగుళాల ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే ఆటోమేటిక్ బ్రైట్‌నెస్ సర్దుబాటు కోసం యాంబియంట్ లైట్ సెన్సార్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బిప్-6 దృఢమైన అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్‌తో వస్తుంది. అలాగే అంతర్నిర్మిత మైక్రోఫోన్, స్పీకర్ ద్వారా బ్లూటూత్ కాలింగ్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంది. బిప్ 5లోని ఐపీ68 రేటింగ్‌లతో పోలిస్తే ఇది 5 ఏటీఎం (50 మీటర్లు) నీటి నిరోధకతతో వస్తుంది. 

అమేజ్ ఫిట్ బిప్-6 స్మార్ట్  అంతర్నిర్మిత జీపీఎస్ మద్దతుతో వసతుంది. ముఖ్యంగా ఈ వాచ్ ఐదు శాటిలైట్ సిస్టమ్స్‌కు మద్దతు ఇస్తుంది. అలాగే ఈ స్మార్ట్ వాచ్‌లో హైరాస్క్ రేస్, స్మార్ట్ స్ట్రెంత్ ట్రైనింగ్, పర్సనలైజ్డ్ ఏఐ కోచింగ్ వంటి 140+ స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి. అలాగే 14 రోజుల బ్యాటరీ లైఫ్ ఈ వాచ్ ప్రత్యేకతగా నిలుస్తుంది. ఈ వాచ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు వెర్షన్‌లకు కనెక్ట్ అవ్వడానికి బ్లూటూత్ 5.2తో వస్తుంది. జెప్ ఓఎస్ 2.0 ప్రాసెసర్ ద్వారా ఈ వాచ్ పని చేస్తుంది. పీపీజీ బయోమెట్రిక్ సెన్సార్ ధారంగా పని చేస్తుంది. 

అమేజ్‌ఫిట్ బిప్-6 స్మార్ట్ వాచ్ ద్వారా 24 గంటలూ హృదయ స్పందన రేటు, ఎస్‌పీఓ2 & ఒత్తిడి పర్యవేక్షణ వంటివి ట్రాక్ చేయవచ్చు. క్యాలెండర్ రిమైండర్, కాల్ నోటిఫికేషన్, సెడెంటరీ రిమైండర్‌లు, స్మార్ట్‌ఫోన్ యాప్‌ల నోటిఫికేషన్‌లు పొందవచ్చు. అలాగే స్మార్ట్ ఫోన్ సంగీత నియంత్రణ, కెమెరా నియంత్రణ కూడా చేయవచ్చు. ఈ వాచ్ 340 ఎంఏహెచ్ బ్యాటరీతో రావడం వల్ల 14 రోజులు పని చేస్తుంది. అయితే బ్యాటరీ సేవర్ మోడ్‌లో వాడితే 26 రోజుల వరకు పని చేస్తుంది. అమేజ్‌ఫిట్ బిప్ 6 బ్లాక్, చార్‌కోల్, స్టోన్, రెడ్ రంగులలో లభిస్తుంది. అలాగే ఈ వాచ్ ధర దీని ధర రూ. 7,999గా ఉంది. ఈ వాచ్ అమేజ్‌ఫిట్ ఇండియా వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి