మార్కెట్లో స్మార్ట్ ఫోన్లకు కొదువలేదు. ప్రతి రోజూ ఏదో ఒక కొత్త మొబైల్ లాంచ్ అవుతూనే ఉంది. రకరకాల వేరియంట్లు, అద్భుత ఫీచర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకూ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరలో అధిక ఫీచర్లు, పనితీరు అందించే ఫోన్లలో లావా కంపెనీ కూడా ఒకటి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా లావా తన ఉత్పత్తులను లాంచ్ చేస్తుంటుంది. అదే క్రమంలో లావా అగ్ని-2 5జీ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. అనువైన బడ్జెట్‌లోనే దీనిని ఆవిష్కరించనుంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం మే నెల మధ్యలోనే దీనిని లాంచ్ అవకాశం ఉంది. అయితే కంపెనీ దీనిని ధ్రువీకరించలేదు. అయితే లావా కొత్త స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్లు మాత్రం బయటకొచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
లావా అగ్ని-2 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు బయటకొచ్చాయి. వాటిల్లో ముఖ్యమైనది కెమెరా సామర్థ్యం. వెనుకవైపు 50ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇది డిజైన్ కూడా చాలా క్లాసీగా ప్రీమియం లుక్‌లో ఉంది. వృత్తాకార ఆకారంలో క్వాడ్ కెమెరా సెటప్‌ను ఉంచారు. దీని మధ్యలోనే ఎల్‌ఈడీ ఫ్లాష్ కూడా ఉంది. వెనుకవైపు డబుల్ రెయిన్ ఫోర్స్‌డ్ ప్రీమియం గ్లాస్ డిజైన్ ఉంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7050 ఎస్‌ఓసీ నుంచి శక్తిపొందుతుంది. 120Hz అమోల్డ్ కర్వ్‌డ్ డిస్ ప్లే ఉంటుంది.
లావా అగ్ని-2 స్మార్ట్ ఫోన్ లాంచింగ్ డేట్ ఎప్పుడనేది కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ మే నెల మధ్యలోనే ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే డేట్ అనౌన్స్ చేసే చాన్స్ ఉంది. ప్రస్తుతానికి తెలిసిన సమాచారం ప్రకారం ఇది గ్రీన్ కలర్‌లో మాత్రమే వస్తోంది. అయితే మరిన్ని కలర్ ఆప్షన్‌లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
లావా అగ్ని-2 స్మార్ట్ ఫోన్ ధర కూడా కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే అందరికీ అనువైన ధరలోనే ఈ ఫోన్ లభించే అవకాశం ఉంది. మార్కెట్ వర్గాల అంచనాప్రకారం రూ.20,000లోపు దీని ధర ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ ధరలో ఉన్న రెడ్‌మీ, జియోమీ, మోటోరోలా, పోకో, రియల్‌మీ, శామ్‌సంగ్ వంటి ఫోన్లకు ఇది పోటీ కాగలదని అంచనా వేస్తున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..