
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఒప్పో మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను మన దేశంలో లాంచ్ చేసింది. వాస్తవానికి గత నెలలోనే ఒప్పో తన రెనో10 సిరీస్ ను ఇక్కడ విడుదల చేసింది. ఒప్పో రెనో 10 సిరీస్ లో మూడు స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒప్పో రెనో10, రెనో10 ప్రో, రెనో 10 ప్రో ప్లస్ పేరుతో వీటిని లాంచ్ చేసింది. ఆ సమయంలో వీటిల్లో అత్యంత సరసమైన ధరలో లభించే రెనో10 కు సంబంధించిన వివరాలు ప్రకటించలేదు. ధర, లభ్యత, పూర్తి స్పెసిఫికేషన్లను వెల్లడించలేదు. ఇప్పుడు దీనిని పూర్తిగా రివీల్ చేస్తూ ఒప్పో రెనో10ను మార్కెట్లో వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
మన దేశంలో ఒప్పో ఫోన్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి వచ్చే ఫోన్లపై వినియోగదారులకు గురి ఎక్కువ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల లాంచ్ అయితే ఒప్పో రెనో10 సిరీస్ ఫోన్లలో రెనో10పై అధిక ఆసక్తి ఉంది. ఇప్పుడు ఆ ఫోన్ ధర, ఇతర ప్రారంభ ఆఫర్లను కంపెనీ ప్రకటించింది. ఈ ఒప్పో రెనో10 స్మార్ట్ ఫోన్ రూ. 32,999 ప్రారంభ ధరతో వస్తోంది. ఇది ఐస్ బ్లూ, సిల్వర్ గ్రే కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇది ఒప్పో ఈ-స్టోర్ తో పాటు ఆఫ్ లైన్ లో అధికారిక రిటైల్ స్టోర్లు, ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో కూడా అందుబాటులో ఉంటుంది.
ఈ ఒప్పో రెనో10 5జీ ఫోన్ కొనుగోలు చేయాలనుకొనే వారికి పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ స్మార్ట్ ఫోన్ లో 6.7 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ అమోల్డ్ డిస్ ప్లే ఉంటుంది. 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ అందిస్తుంది. దీనిలో మీడియా టెక్ డైమెన్సిటీ 7050 చిప్ సెట్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఈ ఫోన్ వస్తుంది. కలర్ ఓఎస్ 13.1తో పాటు ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ పై ఇది పనిచేస్తుంది.
దీనిలో వెనుక వైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 64ఎంపీ ప్రైమరీ కెమెరాతో ఫాటు, 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 32ఎంపీ టెలిఫోటో కెమెరా ఉంటాయి. ముందు వైపు సెల్ఫీల కోసం 32ఎంపీ కెమెరా ఉంటుంది. 67 వాట్ల సూపర్ వీఓఓసీ చార్జింగ్ సపోర్టుతో 5000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..