Twitter: ట్విట్టర్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై మీ ట్వీట్‌కు ఎవరు రిప్లై ఇవ్వాలో కూడా మీరే ఎంచుకోవచ్చు. ట్వీట్‌ చేసిన తర్వాత కూడా.

Twitter: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఎవరైనా తమ అభిరుచులను, అభిప్రాయాలను ఇతరులతో పంచుకునే అవకాశం లభించింది. ఇక సామాన్య జనాలు కూడా సెలబ్రిటీలతో నేరుగా స్పందించే అవకాశం లభిస్తోంది...

Twitter: ట్విట్టర్‌లో కొత్త ఫీచర్‌.. ఇకపై మీ ట్వీట్‌కు ఎవరు రిప్లై ఇవ్వాలో కూడా మీరే ఎంచుకోవచ్చు. ట్వీట్‌ చేసిన తర్వాత కూడా.
Twitter New Feature

Edited By: Ravi Kiran

Updated on: Jul 19, 2021 | 6:29 AM

Twitter: సోషల్‌ మీడియా విస్తృతి పెరిగినప్పటి నుంచి ఎవరైనా తమ అభిరుచులను, అభిప్రాయాలను ఇతరులతో పంచుకునే అవకాశం లభించింది. ఇక సామాన్య జనాలు కూడా సెలబ్రిటీలతో నేరుగా స్పందించే అవకాశం లభిస్తోంది. సెలబ్రిటీలు వ్యక్తం చేసిన అభిప్రాయాలపై నెటిజన్లు నేరుగా స్పందిస్తున్నారు. అయితే కొన్ని సార్లు ఇది ట్రోలింగ్‌కు దారి తీస్తున్నాయి. తమకి నచ్చని అంశాలకు సంబంధించి పోస్ట్‌ చేసిన వారిపై కొందరు దారుణంగా కామెంట్లు చేస్తుండడం ఇటీవల బాగా ఎక్కువైంది. దీనికి చెక్‌ పెట్టడానికే తాము చేసిన పోస్ట్‌కు ఎవరు కామెంట్‌ చేయాలో కూడా ఎంచుకునే ఆప్షన్‌ను కొన్ని సోషల్‌ మీడియా సైట్‌లు కలిపించాయి. ట్విట్టర్‌ కూడా ఇలాంటి ఫీచర్‌నే తీసుకొచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ ఆప్షన్‌ ట్వీట్‌ చేసే ముందు మాత్రమే ఉపయోగించుకునేలా ఉంది. కానీ ట్వీట్ చేసిన తర్వాత కూడా మీ ట్వీట్లకు ఇచ్చే రిప్లైలను కంట్రోల్ చేసే అవకాశం ఉంటే భలే ఉంటుంది కదూ.! ఇలాంటి ఆలోచన నుంచే ట్విట్టర్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ఈ కొత్త ఆప్షన్‌ ద్వారా ట్వీట్‌ చేసిన తర్వాత కూడా ఎవరు రిప్లై ఇవ్వచ్చనేది నిర్ణయించుకునే వెసులుబాటు లభిస్తుంది. ఈ ఫీచర్‌ అందుబాటులోకి రావాలంటే యూజర్లను తమ యాప్‌ను అప్‌డేట్‌ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఈ కొత్త ఫీచర్‌తో ట్రోలింగ్‌కు చెక్‌ పడుతుందని ట్విట్టర్‌ యాజమాన్యం భావిస్తోంది. ట్విట్టర్‌ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్‌తో ట్రోలింగ్‌కు నిజంగానే ఫుల్‌స్టాప్‌ పడుతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఇదిలా ఉంటే ఫేస్‌బుక్‌ ఇప్పటికే ఇలాంటి ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఫేస్‌బుక్‌లో మనం చేసిన పోస్టుకు కామెంట్ ఎవరు ఇవ్వాలనే నిర్ణయాన్ని యూజర్ తీసుకునే అవకాశం కలిపించింది ఫేస్‌బుక్‌.

Also Read: AIMIM official Twitter: మజ్లిస్‌ పార్టీ ట్విట్టర్‌ ఖాతా హ్యాక్.. డీపీగా ఏం పెట్టారంటే..?

Plastic surgery: కృత్రిమ సౌందర్యం కోసం ఆరాటం.. ప్రాణాలు కోల్పోతున్న వైనం

HECL Job Notification: టెన్త్, ఇంటర్ పాసైన నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మంచి జీతంతో ప్రభుత్వ ఉద్యోగానికి నోటిఫికేషన్