Greta e Scooters: సూపర్ ఫీచర్స్.. బడ్జెట్ ధరల్లో గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు..

|

Nov 23, 2021 | 9:33 PM

భారత మార్కెట్లో ముఖ్యంగా ద్విచక్ర వాహనాల విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఒకవైపు ప్రముఖ వాహన తయారీదారులు తమ కొత్త మోడళ్లను పరిచయం చేయడంలో బిజీగా ఉండగా, కొత్త స్టార్టప్‌లు కూడా ఈ సెగ్మెంట్‌లోకి వేగంగా ప్రవేశిస్తున్నాయి.

Greta e Scooters: సూపర్ ఫీచర్స్.. బడ్జెట్ ధరల్లో గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే వంద కిలోమీటర్లు..
Greta Electric Scooters
Follow us on

Greta e Scooters: భారత మార్కెట్లో ముఖ్యంగా ద్విచక్ర వాహనాల విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఒకవైపు ప్రముఖ వాహన తయారీదారులు తమ కొత్త మోడళ్లను పరిచయం చేయడంలో బిజీగా ఉండగా, కొత్త స్టార్టప్‌లు కూడా ఈ సెగ్మెంట్‌లోకి వేగంగా ప్రవేశిస్తున్నాయి. ఈరోజు(నవంబర్ 23) గుజరాత్‌కు చెందిన గుజరాత్ ఎలక్ట్రోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రేటా బ్రాండ్‌తో విస్తృత శ్రేణి ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేసింది.

గుజరాత్‌కు చెందిన ఈ స్టార్టప్ గ్రేటా బ్రాండ్‌ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తోంది. కంపెనీ ఈరోజు మార్కెట్లో 4 కొత్త మోడళ్లను ప్రవేశపెట్టింది. ఇందులో హార్పర్, ఎవెస్పా, గ్లైడ్, హార్పర్ ZX ఉన్నాయి. ఈ స్కూటర్లను కొత్త ఆకర్షణీయమైన రంగులు, అత్యాధునిక డిజైన్లు, పెద్ద స్టోరేజ్ స్పేస్‌తో పరిచయం చేశారు.

ఈ స్కూటర్లు ధరలో తక్కువగా ఉండటమే కాకుండా మెరుగైన డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తున్నాయని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్లలో కంపెనీ 48-వోల్ట్ నుంచి 60-వోల్ట్ కెపాసిటీ గల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌లను ఉపయోగించింది. ఈ స్కూటర్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 70 నుంచి 100 కిమీల డ్రైవింగ్ రేంజ్ ఇస్తాయని కంపెనీ తెలిపింది.

విభిన్న బ్యాటరీలను ఎంచుకోవడానికి ఎంపిక:

గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు 4 విభిన్న బ్యాటరీ ప్యాక్‌ల నుంచి ఎంపిక చేసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తోంది. V2 (లిథియం+48V), V2+ (లిథియం+60V), V3 (లిథియం+48V), V3+ (లిథియం+60V) సామర్థ్యాలతో ఈ ఎంపికలలో బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో, మీరు స్కూటర్‌లో ఉపయోగించే దేనినైనా ఎంచుకోవచ్చు.

గ్రేటా ఎలక్ట్రిక్ స్కూటర్ల ఫీచర్లు ఇవే..

ఈ స్కూటర్లలో అధునాతన ఫీచర్లు, టెక్నాలజీని ఉపయోగించామని గ్రెటా తెలిపింది. ఒక్కో ఛార్జ్‌కి 100 కి.మీల పరిధిని అందించడమే కాకుండా, వీటి డ్రైవింగ్ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ స్కూటర్‌లు డేటైమ్ రన్నింగ్ లైట్లు (DRL), EBS, రివర్స్ మోడ్, ATA సిస్టమ్, స్మార్ట్ షిఫ్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ డిస్‌ప్లే, కీలెస్ స్టార్ట్, యాంటీ-థెఫ్ట్ అలారం వంటి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి.

గ్రెటా హార్పర్, ఎవెస్పా, హార్పర్ ZX మోడల్‌లు డ్రమ్ బ్రేక్‌లను పొందగా, గ్లైడ్ అధిక వేగంతో కూడా సమతుల్య బ్రేకింగ్‌ను అందించే డ్యూయల్ హైడ్రాలిక్ బ్రేక్‌లతో వస్తోంది. ఈ స్కూటర్లను హోమ్ సాకెట్ యూనిట్‌కు కనెక్ట్ చేయడం ద్వారా సులభంగా ఛార్జ్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. వాటి బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4 గంటలు పడుతుంది. ఈ స్కూటర్ల ధర రూ.60,000 నుంచి రూ.92,000 వరకు ఉంటుంది.

గ్రేటా స్కూటర్లు 22 విభిన్నమైన ఆకర్షణీయమైన రంగు ఎంపికలలో లభిస్తాయి. మరోవైపు, ప్రీమియం టర్కోయిస్ బ్లూ, రోజ్ గోల్డ్ రంగులను కంపెనీ సిగ్నేచర్ కలర్స్ గా ప్రవేశపెట్టారు. 2019 చివరిలో గ్రేటా స్కూటర్‌లు ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ICAT) నుండి ఆమోదం పొందాయని కంపెనీ చెప్పింది.

ఇవి కూడా చదవండి: Vodafone Idea Tariff Hike: కస్టమర్లకు షాకివ్వనున్న వొడాఫోన్ ఐడియా.. భారం కానున్న ప్రీపెయిడ్ ప్లాన్‌లు.. ఎప్పటి నుంచో తెలుసా?

Joker Virus: యూజర్లు అలర్ట్.. జోకర్‌ వైరస్‌ మళ్లీ వచ్చింది.. మీ ఫోన్‌లో ఈ 15 యాప్స్‌ ఉంటే వెంటనే తొలగించండి