Whatsapp Scam: వాట్సాప్‌ మాటున పొంచి ఉన్న ఆన్‌లైన్‌ మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు.

|

Aug 15, 2021 | 8:00 AM

Whatsapp Scam: ప్రతీ చిన్న అంశాన్ని తమకు అనువుగా మార్చుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు సైబర్‌ నేరగాళ్లు. కొత్త కొత్త దారులు వెతుక్కుంటూ మరీ ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు...

Whatsapp Scam: వాట్సాప్‌ మాటున పొంచి ఉన్న ఆన్‌లైన్‌ మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే అంతే సంగతులు.
Whatsapp Scam
Follow us on

Whatsapp Scam: ప్రతీ చిన్న అంశాన్ని తమకు అనువుగా మార్చుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు సైబర్‌ నేరగాళ్లు. కొత్త కొత్త దారులు వెతుక్కుంటూ మరీ ప్రజలను బురిడి కొట్టిస్తున్నారు. ప్రపంచంలో ఏదో మూలన ఉండి మన ఖాతాల్లోని డబ్బులను కాజేస్తున్నారు. అయితే వీటికి సైబర్‌ నేరగాళ్లు పెట్టుబడిగా పెడుతోంది మన అత్యాశేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రోజుకో కొత్త రకం సైబర్‌ నేరం వెలుగులోకి వస్తోన్న తరుణంలో తాజాగా వాట్సాప్‌ మోసం ఒకటి బయటకు వచ్చింది. ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ను తమ నేరానికి అస్త్రంగా ఉపయోగించుకొని నేరాలకు పాల్పడుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌ పేరుతో వాట్సాప్‌ యూజర్లకు మొదట ఓ లింక్‌ను పంపిస్తారు. పొరపాటున ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే వెంటనే మీ బ్యాంకుకు సంబంధించిన వివరాలన్నీ హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. ఇంకేముంది ఖాతాల్లోని డబ్బు మొత్తం క్షణంలో మాయమైపోతుంది. ఈ క్రమంలోనే రష్యాకు చెందిన ప్రముఖ సైబర్‌ సెక్యూరిటీ సంస్థ కాస్పర్‌స్కై వాట్సాప్‌ యూజర్లను హెచ్చరించింది. ఈ మోసపూరిత లింక్‌లను పంపిస్తున్న వారు ఆన్‌లైన్‌ డెలివరీ కంపెనీల ఎగ్జిక్యూటివ్స్‌గా పనిచేసిన వారుగా ఉన్నారని కాస్పర్‌స్కై పరిశోధకులు వెల్లడించారు. ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థలు అందించే ప్రొడక్ట్స్‌ను వాట్సాప్‌ ద్వారా యూజర్లకు పంపుతూ పేమెంట్‌ చేసే సమయంలో వారి బ్యాంకు వివరాలను పూర్తిగా తెలుసుకోని యూజర్ల ఖాతాల్లోని డబ్బును కొట్టేస్తున్నట్లు కాస్పర్‌స్కై తెలిపింది. ఈ ఫేక్‌ లింక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని అనుమానస్పదంగా ఉన్న లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదని వాట్సాస్‌ యూజర్లను కాస్పర్‌స్కై పేర్కొంది.

Also Read: Jio: 365 రోజుల పాటు రోజుకు 3GB డేటా, అపరిమిత కాలింగ్.. SMS పూర్తిగా ఫ్రీ.. ఈ జియో ప్లాన్‌లో మరిన్ని ప్రయోజనాలు..

Lucifer Telugu remake : మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో.. లూసిఫర్ తెలుగు రీమేక్‌‌‌‌లో కీలక పాత్రలో ఆ హీరో

Japan Floods: ఎడతెరిపిలేని వానలతో నీటమునిగిన ప్రధాన నగరాలు.. ఎవరి ప్రాణలకు వారే భాధ్యులు.. అక్కడ సర్కార్ కీలక ప్రకటన