Selfie On Mars: అంగారక గ్రహం (మార్స్)పై పరిశోధనల్లో శాస్ర్తవేత్తలు దూసుకుపోతున్నారు. ఇప్పటి వరకు చేపట్టిన అన్ని ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇదే క్రమంలో తాజాగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మార్స్‌పైకి పర్సెవరెన్స్ అనే రోవర్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టింది. మార్స్‌పై ఉన్న జెజెరో బిలంలో దిగిన రోవర్ అంగారకుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులతో పాటు మార్స్‌పై ఉన్న మట్టి శాంపిల్స్‌ను సేకరిస్తూ బిజీ బిజీగా గడిపేస్తుంది.
అయితే తాజాగా గత శనివారం ఇన్‌జెన్యుటీ రోవర్ నుంచి ఇన్‌జెన్యుటీ హెలికాప్టర్ అరుణ గ్రహంపై అడుగుపెట్టింది. 1.8 కిలోల బరువుండే ఇన్‌జెన్యుటీ హెలికాప్టర్ అంగారక గ్రహంపై ఉన్న మైనస్ 90 డిగ్రీల ఉష్ణోగ్రతను సైతం తట్టుకొని నిలిచింది. ఇక తొలి ప్రయత్నంలో సెకనుకు మూడు మూడు అడుగుల వేగంతో గాల్లోకి ఎగిరిందీ హెలికాప్టర్. ఇక మరికొన్ని రోజుల్లో హెలికాప్టర్ పూర్తి స్థాయిలో గగనయానం చేయనుంది. ఈ క్రమంలో మార్స్‌పై ఉన్న వాతావరణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను భూమిపైకి పంపిస్తుంది.
ఇక తాజాగా రోవర్.. మార్స్‌పైకి వచ్చిన హెలికాప్టర్‌తో ఓ సెల్ఫీ ఫొటోను దిగి భూమిపైకి పంపించింది. ఈ ఫొటోను నాసా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ.. ‘జెజెరో నుంచి నేను మీకు హాయ్ చెబుతున్నాను. ఈ మిషన్‌లో భాగంగా నేను నా తొలి సెల్ఫీని తీసుకున్నాను. నేను కూడా ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్‌ను చూశాను. మరికొన్ని రోజుల్లో హెలికాప్టర్ తన తొలి గగన విహారానికి సిద్ధమవుతోంది’ అంటూ ఆసక్తికరమై క్యాప్షన్ జోడించారు. ప్రస్తుతం ఈ రోబోల సెల్ఫీ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. భూమికి కోన్ని లక్షల కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రహంపై ఉన్న రోబో భూమిపైకి సందేశాలను పంపిస్తుండడం పట్ల మానవాళి ఆశ్చర్యపోతోంది. మరి ఇన్‌జెన్యూటీ హెలికాప్టర్ అంగారకునిపై ఉన్న ఎలాంటి రహస్యాలను బయటపెడుతుందో చూడాలి.
Two bots, one selfie. Greetings from Jezero Crater, where I’ve taken my first selfie of the mission. I’m also watching the #MarsHelicopter Ingenuity as it gets ready for its first flight in a few days. Daring mighty things indeed.
Images: https://t.co/owLX2LaK52 pic.twitter.com/rTxDNK69rs
— NASA’s Perseverance Mars Rover (@NASAPersevere) April 7, 2021
Also Read: Facts About Mars: అంగారక గ్రహంపై ఏడాదికి 687 రోజులు… మార్స్‌కి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు..
Partnered: అదిరే ఫీచర్లతో మార్కెట్లోకి సామ్‌సంగ్ F12 .. సరసమైన ధరకే.. నెక్ట్స్ సేల్ ఎప్పుడంటే..