Clouds on Mars: నాసా క్యూరియాసిటీ రోవర్ మార్స్ మీద మెరిసే మేఘాలను ఫోటోలు తీసింది. ఈ మేఘాలు అచ్చు భూమి మీద నుంచి మనకు కనిపించే మేఘాల మాదిరిగానే కనిపిస్తుండడం విశేషం. అంతరిక్షం, అంగారక గ్రహానికి సంబంధించిన రహస్యాల పొరలు ఇప్పుడు నెమ్మదిగా తెరుచుకుంటున్నాయి. యుఎస్ అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన క్యూరియాసిటీ రోవర్ అంగారక గ్రహంపై కనిపించే మేఘాల అందమైన చిత్రాన్ని తీసింది. మేఘాల గురించి బయటకు వచ్చిన చిత్రం ఊహించిన దానికంటే ఎక్కువ అద్భుతం అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇప్పుడు ఈ ఫోటోలపై అధ్యయనం ప్రారంభమ కాబోతోంది. అంగారక గ్రహం పై వాతావరణం చల్లగా, పొడిగా ఉంటుంది, కాబట్టి అక్కడ మేఘాలను చూడటం చాలా అరుదుగా పరిగణిస్తారు. సంవత్సరంలో ఒకసారి అతి శీతల సమయంలో మేఘాలు సాధారణంగా అంగారక గ్రహం భూమధ్యరేఖ వద్ద కనిపిస్తాయి.
మార్స్ మీద ప్రాణాల కోసం వెతుకుతున్న క్యూరియాసిటీ రోవర్ ఇంతకుముందు మేఘాల వీడియోను పంపింది. మార్స్ క్లౌడ్స్ ట్విట్టర్ ఖాతా నుండి దీనికి సంబంధించి ఒక ఫోటో షేర్ చేశారు. ‘కొన్నిసార్లు మీరు అంగారక గ్రహంపై ఆగి మేఘాలను చూడాలి. మేఘావృతమైన రోజులు ఇక్కడ చాలా అరుదు ఎందుకంటే వాతావరణం చాలా చలిగా, పొడిగా ఉంటుంది. కానీ, నేను(మార్స్ క్లౌడ్స్ కంపోజిషన్) నా కెమెరాలను దానిపై ఉంచాను. మీతో కొన్ని చిత్రాలను పంచుకోవాలనుకుంటున్నాను. అంటూ క్యాప్షన్ కూడా ఈ ఫోటోలకు జత చేశారు. ఆ ట్వీట్ ఇక్కడ చూడొచ్చు..
Sometimes you just need to stop and watch the clouds roll by… on Mars.
Cloudy days are rare here because the atmosphere is so thin and dry, but I’ve been keeping my cameras peeled and wanted to share some recent pictures with you. https://t.co/Gtgz9Iu822 (1/4) pic.twitter.com/iJOLmnXMVo
— Curiosity Rover (@MarsCuriosity) May 28, 2021
రోవర్ ఖాతాతో రెండు GIF లు కూడా షేర్ చేశారు. మేఘాల మెరుపును ‘మదర్స్ ఆఫ్ పెర్ల్స్’ క్లౌడ్ (మార్స్ క్లౌడ్స్ రోవర్) అంటారు. GIF లో, రాత్రి మేఘాలు మెరుస్తూ కనిపిస్తున్నాయి. దీనిని నైట్ షైనింగ్ క్లౌడ్ అని పిలుస్తారు. మార్స్ మీద చాలా ఎత్తులో కనిపించిన ఈ మేఘాలు పొడి మంచుతో తయారయ్యే అవకాశం ఉంది. దీని క్రిస్టల్ సూర్యుడి నుండి ఈ కాంతిని పొందింది. దీనివల్ల రాత్రి కూడా మేఘాలు మెరుస్తున్నాయి. అంగారక గ్రహం, భూమిపై మేఘాలు ఏర్పడే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
మేఘాలు ఎలా ఏర్పడతాయి?
నీటి కణాలు మేఘాలుగా మారడానికి కణాలను చల్లబరచాలి. ఈ కణాలు భూమిపై దుమ్ము కావచ్చు. ఇది గాలితో పైకి వెళుతుంది. కానీ అంగారక గ్రహం యొక్క వాతావరణం పలుచగా ఉంటుంది. కాబట్టి అక్కడ మేఘాలు ఏర్పడటం కష్టం. అవి వేరే ప్రక్రియతో తయారవుతాయి. అంగారక గ్రహం మేఘాలు 37 మైళ్ల ఎత్తు వరకు కదులుతాయి. ఈ మేఘాలు చల్లని కార్బన్ డయాక్సైట్ లేదా పొడి మంచుతో తయారయ్యాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఫోటోలు రోవర్ యొక్క బ్లాక్ అండ్ వైట్ నావిగేషన్ కెమెరా మరియు మాస్క్ కెమెరా నుండి తీసినవి. రాత్రి సమయంలో కూడా, మేఘాలు మెరుస్తున్నాయి ఎందుకంటే దాని మంచు స్ఫటికాలు సూర్యరశ్మిని శోషించుకోవడం వలన.