ప్రారంభ స్థాయి, మధ్యస్థ ఫోన్స్‌కు ప్రసిద్ధి చెందిన మోటోరోలా కంపెనీ మరోకొత్త ఫోన్‌ను మార్కెట్‌లోకి రిలీజ్ చేసింది. మోటోరోలా జీ 32 పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫోన్‌లో ఇప్పటికే 4 జీబీ వేరియంట్ అందుబాటులో ఉండగా దాన్ని అప్‌గ్రేడ్ చేస్తూ 8 జీబీ వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. 8 జీబీ ర్యామ్‌తో అందుబాటులో ఉండే ఈ ఫోన్ ఫ్లిప్ కార్ట్‌లో రూ.11,999 ధరకు అందుబాటులో ఉంది. మినరల్ గ్రే, శాటిన్ సిల్వర్ కలర్స్‌లో ఆకర్షణీయమైన డిజైన్‌లో ఈ ఫోన్ వినియోగదారులను అలరించనుంది. అయితే ఈ ఫోన్‌లో 4 జీబీ వేరియంట్ రూ.10,499కు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఫోన్ లాంచ్ సమయంలో మాత్రం రూ.12,999గా పేర్కొనడం గమనార్హం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..