
మోటరోలా కంపెనీ తన తాజా ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో అధికారికంగా విడుదల చేసింది. మోటరోలా రేజర్ 60 అల్ట్రా పేరుతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన రెండు వారాల తర్వాత భారత మార్కెట్‌లో రిలీజ్ చేశారు. 6.9-అంగుళాల పీఓఎల్ఈడీ ప్రధాన డిస్‌ప్లేతో పాటు 3.6 అంగుళాల పీఓఎల్ఈడీ కవర్ స్క్రీన్‌తో ఈ ఫోన్ ఆకట్టుకుంటుంది. మీడియా టెక్ డైమెన్సిటీ 7400 ఎక్స్ చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందే ఈ స్మార్ట్ ఫోన్ 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే ఈ ఫోన్ 30 వాట్స్ టర్బోపవర్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
మోటరోలా రేజర్ 60 8 జీబీ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.49,999గా కంపెనీ పేర్కొంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ ఇది జూన్ 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా ఇండియా వెబ్‌సైట్ మరియు ఎంపిక చేసిన రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ మూడు సొగసైన కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. పాంటోన్ జిబ్రాల్టర్ సీ వేరియంట్ ఫాబ్రిక్ లాంటి ఫినిషింగ్‌తో ఆకట్టుకుంటే పాంటోన్ లైటెస్ట్ స్కై, పాంటోన్ స్ప్రింగ్ బడ్ ఎంపికలు వరుసగా మార్బుల్ లాంటి వేగన్ లెదర్ వెనుక ప్యానెల్‌లతో ఆకర్షిస్తాయి. ఈ ఫోన్ 120 హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో పాటు 3,000 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. ఈ ఫోన్ 120 పర్సెంట్ డీసీఐ-పీ3 కలర్ గమట్‌ను కూడా కవర్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ హెచ్‌డీఆర్ 10+కు మద్దతు ఇస్తుంది. 3.63-అంగుళాల పీఓఎల్ఈడీ కవర్ డిస్‌ప్లే 1,056×1,066 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ స్క్రీన్ 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1,700 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్‌ను ఇస్తుంది.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే మోటరోలా రేజర్ 60 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రైమరీ ఔటర్ కెమెరా, ఎఫ్/1.7 ఎపర్చరు, క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో ఆకట్టుకుంటుంది. అలాగే ఎఫ్/2.2 ఎపర్చరుతో 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ షూటర్‌తో పాటు /2.4 ఎపర్చరుతో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతగా ఉంటుంది. ఈ ఫోన్ మోటో ఏఐ సూట్‌తో వస్తుంది. ఇది ఏఐ-ఆధారిత ఇమేజింగ్ ఫీచర్స్‌తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 30 వాట్స్ టర్బోచార్జింగ్ సామర్థ్యాలతో 4,500ఎంఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది. అలాగే 15 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ భద్రత విషయానికి వస్తే సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఐపీ48 రేటింగ్‌తో ఆకట్టుకుంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి