Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motorola Smartphone: చవకైన ధరలో మోటోరోలా కొత్త ఫోన్.. కేవలం రూ. 8,999కే.. 8జీబీ ర్యామ్, 128జీబీ మెమరీ..

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ను మన దేశంలో లాంచ్ చేసింది. అది బడ్జెట్ లెవెల్లోనే. కేవలం రూ. 8,999కే అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్ ని విడుదల చేసింది. ఇది ప్రముఖ ఈ -కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్, మోటోరోలా ఆన్ లైన్ స్టోర్, ఆఫ్ లైన్ స్టోర్లలో ఆగస్టు 16 నుంచి విక్రయాలకు రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

Motorola Smartphone: చవకైన ధరలో మోటోరోలా కొత్త ఫోన్.. కేవలం రూ. 8,999కే.. 8జీబీ ర్యామ్, 128జీబీ మెమరీ..
Motorola Moto E13
Follow us
Madhu

|

Updated on: Aug 15, 2023 | 5:00 PM

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్స్ మేకర్ లెనోవా ఆధ్వర్యంలో పనిచేసే ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మోటోరోలా ఓ కొత్త స్మార్ట్ ఫోన్ ను మన దేశంలో లాంచ్ చేసింది. అది బడ్జెట్ లెవెల్లోనే. కేవలం రూ. 8,999కే అత్యాధునిక ఫీచర్లతో ఈ ఫోన్ ని లాంచ్ చేసింది. ఇది ప్రముఖ ఈ -కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్, మోటోరోలా ఆన్ లైన్ స్టోర్, ఆఫ్ లైన్ స్టోర్లలో ఆగస్టు 16 నుంచి విక్రయాలకు రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ కాస్మిక్ బ్లాక్, అరోరా గ్రీన్, క్రీమీ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. కంపెనీ పలు ప్రారంభ ఆఫర్లను అందిస్తోంది. రిలయన్స్ జియో వినియోగదారులు రూ. 2,500 వరకూ పలు క్యాష్ బ్యాక్ , గిఫ్ట్ వోచర్స్ అందిస్తోంది.

మోటో ఈ13 స్పెసిఫికేషన్లు..

ఈ కొత్త మోటో ఈ 13 స్మార్ట్ ఫోన్లో టీ606 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంటుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే, హెచ్ డీ ప్లస్ రిజల్యూషన్ తో ఉంటుంది. ప్రీమియం అక్రిలిక్ గ్లాస్ బాడీతో ఉంటుంది. 179.5 గ్రాముల బరువు ఉంటుంది.

కెమెరా విషయానికి వస్తే వెనుకవైపు 13 మెగా పిక్సల్ సెన్సార్ ఉంటుంది. ముందు వైపు 5ఎంపీ కెమెరా ఉంటుంది. రెండు కెమెరాలకు ఎఫ్/2.2 అపెర్చుర్ తో ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ తో వీడియోలు రికార్డు చేయగలుగుతాయి. వెనుక వైపు కెమెరా ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ కు సపోర్టు చేస్తుంది. కెమెరా ఫీచర్లను గమినస్తే పోర్ట్ రైట్ మోడ్, పనోరమా మోడ్, ప్రో మోడ్, నైట్ విజన్, ఆటో స్మైల్ క్యాప్చర్ ఉంటాయి. ముందు వైపు ఉండే కెమెరా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే బ్యూటీ మోడ్, ఆటో స్మైల్ క్యాప్చర్ ఫీచర్లు ఉంటాయి.

మోటో ఈ 13లో 5,000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. 10వాట్ల యూఎస్బీ టైప్ సీ చార్జర్ఱ ఉంటుంది. ఐపీ52 రేటింగ్ తో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఉంటుంది. కనెక్టివిటీ ఫీచర్ల విషయానికి వస్తే వైఫై, బ్లూటూత్ 5.0, డాల్బీ అట్మోస్ మోనో స్పీకర్ ఉంటుంది.

మోటో జీ14 ఇలా..

మోటో ఈ-సిరీస్ కు తోడు మోటో జీ14 స్మార్ట్ ఫోన్ ను కూడా మోటోరోలా విడుదల చేసింది. ఈ మోటో జీ14 ధర రూ. 9,999గా ఉంది. దీనిలో 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. 6.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే 60హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. దీనిలో వెనుకవైపు 50ఎంపీ కెమెరా ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది. యూనీసోక్ టీ616 ప్రాసెసర్ ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..