Motorola Smart TV: మార్కెట్లోకి మోటోరోలా స్మార్ట్ టీవీలు.. అదిరే ఫీచర్లతో పాటు అనువైన బడ్జెట్.. మీరూ ఓ లుక్కేయండి..

|

May 10, 2023 | 4:12 PM

మోటోరోలా కంపెనీ కూడా కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. సరికొత్త ఎన్విజన్ సిరీస్ స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. 32 అంగుళాల నుంచి 43 అంగుళాల ఫుల్ హెచ్ డీ, 43 అంగుళాలు, 55 అంగుళాల 4కే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Motorola Smart TV: మార్కెట్లోకి మోటోరోలా స్మార్ట్ టీవీలు.. అదిరే ఫీచర్లతో పాటు అనువైన బడ్జెట్.. మీరూ ఓ లుక్కేయండి..
Motorola Smart Tv
Follow us on

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్ టీవీలకు డిమాండ్ బాగా పెరిగింది. ప్రతి ఇంట్లోనూ ఓ స్మార్ట్ టీవి ఉండాలని అందరూ భావిస్తున్నారు. వాస్తవానికి సోషల్ మీడియా ప్రభావం, స్మార్ట్ ఫోన్లలోని ఆధునికత కారణంగా టీవీల ప్రభ కాస్త తగ్గిందని అందరూ భావించారు. అయితే పాతతరం టీవీల స్థానంలో ఆండ్రాయిడ్ వెర్షన్ స్మార్ట్ టీవీలు రావడం, వాటిల్లోనూ ఓటీటీ యాప్ లు, బ్లూటూట్ కనెక్టివిటీ వంటి అధునాతన ఫీచర్లు అందుబాటులోకి రావడంతో అందరి దృష్టి మళ్లీ టీవీలపై పడింది. ఈ నేపథ్యంలో అన్ని టాప్ కంపెనీలు కూడా స్మార్ట టీవీలను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మోటోరోలా కంపెనీ కూడా కొత్త స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. సరికొత్త ఎన్విజన్ సిరీస్ స్మార్ట్ టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవి 32 అంగుళాల నుంచి 43 అంగుళాల ఫుల్ హెచ్ డీ, 43 అంగుళాలు, 55 అంగుళాల 4కే వరకూ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

డిస్ ప్లే ఇలా.. ఆండ్రాయిడ్ 11 స్మార్ట్ టీవీ బెజెల్ లెస్ డిస్ ప్లే ఉంటుంది. ఇది సినిమాటిక్ అనుభవాన్ని అందిస్తుంది. అన్ని మోడళ్లలో 330 నిట్‌ల వరకు బ్రైట్ నెస్, 178 డిగ్రీల వైడ్ యాంగిల్ వ్యూయింగ్, 12.7 మిలియన్ విభిన్న కలర్స్ తో ఉంటుంది. ఇవి క్వాడ్-కోర్ మీడియాటెక్ ప్రాసెసర్‌ ఆధారంగా పనిచేస్తాయి. ఈ టీవీలు 8GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంటుంది. ఫుల్ హెచ్ డీ మోడల్‌లకు 1జీబీ ర్యామ్, 4కే మోడల్‌లకు 2జీబీ ర్యామ్ ఉంటుంది.

సౌండ్ క్వాలిటీ.. డాల్బీ ఆడియోను సపోర్టు చేస్తుంది. 20వాట్ల స్పీకర్లు ఉంటాయి. వీటి ద్వారా క్వాలిటీ సౌండ్ ను వినియోగదారులు పొందగలుతారు. ఇవి గేమింగ్ కూడా బాగా ఉపయోగపడతాయి. ఏడు సౌండ్ మోడ్‌లు, ఏడు పిక్చర్ మోడ్‌లు ఉంటాయి. వీటిల్లో మూవీ మోడ్, స్టాండర్డ్, వివిడ్, ఎనర్జీ సేవింగ్ మోడ్లు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఓటీటీ యాప్స్.. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 11 ఆధారంగా పనిచేస్తుంది. వీటిల్లో వేల కొలదీ యాప్లను వినియోగించుకోవచ్చు. వివిధ రకాల గేమ్స్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో,డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లతో సహా వేలకొద్దీ యాప్‌లకు యాక్సెస్‌ అందిస్తాయి. గూగుల్ అసిస్టెంట్ ద్వారా వాయిస్ కమాండ్స్ స్వీకరిస్తుంది.

కనెక్టివిటీ.. ఎన్విజన్ సిరీస్ టీవీల్లో డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూ టూత్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. రెండు యూఎస్బీ కనెక్షన్స్, మైక్రో ఏవీ పోర్టు, మూడు హెచ్డీఎంఐ పోర్టులు ఉంటాయి.

ధర ఎంతంటే.. మోటోరోలా ఎన్విజన్ సిరీస్ స్మార్ట్ టీవీలు ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి ఉన్నాయి. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ఫుల్ హెచ్ డీ ధర రూ. 9,999 నుంచి ప్రారంభమవుతోంది. అలాగే 43 అంగుళాల ఫుల్ హెచ్ డీ మోడల్ ధర రూ. 19,999గా ఉంది. అందే విధంగా 43 అంగుళాల 4కే మోడల్ 21,999గా ఉంది. ఇక 55 అంగుళాల 4కే మోడల్ 31,999గా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..