Moto G 84: మరోకొత్త ఫోన్‌ రిలీజ్‌ చేసిన మోటోరోలా.. రూ.20 వేల లోపు ది బెస్ట్‌ ఫోన్‌ ఇదే..!

|

Sep 02, 2023 | 3:45 PM

ముఖ్యంగా బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్‌ చేయడంలో తనదైన మార్క్‌ చూపించే మోటోరోలా తాజాగా మరో నయా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. మోటో జీ సిరీస్‌ను తాజా జోడింపుగా మోటో జీ 84 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ యువత అవసరాలను, ముఖ్యంగా కళాశాల విద్యార్థుల అవసరాలను తీర్చడానికి వ్యూహాత్మకంగా రూపొందించామని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు.

Moto G 84: మరోకొత్త ఫోన్‌ రిలీజ్‌ చేసిన మోటోరోలా.. రూ.20 వేల లోపు ది బెస్ట్‌ ఫోన్‌ ఇదే..!
Moto G 84
Follow us on

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల వాడకం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ముఖ్యంగా టెలికాం రంగంలో 5 జీ విస్తరించిన తర్వాత అన్ని కంపెనీలు తమ మొబైల్‌ ఫోన్స్‌లో 5 జీ వెర్షన్లు రిలీజ్‌ చేస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్‌ చేయడంలో తనదైన మార్క్‌ చూపించే మోటోరోలా తాజాగా మరో నయా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో రిలీజ్‌ చేసింది. మోటో జీ సిరీస్‌ను తాజా జోడింపుగా మోటో జీ 84 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ యువత అవసరాలను, ముఖ్యంగా కళాశాల విద్యార్థుల అవసరాలను తీర్చడానికి వ్యూహాత్మకంగా రూపొందించామని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. మంచి కెమెరా సిస్టమ్, ఫాస్ట్ ఛార్జింగ్‌, స్టైలిష్ డిజైన్ వంటి అధునాత ఫీచర్లతో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. పాంటోన్ కలర్ ఎడిషన్‌ను కలిగి ఉన్న మోటో జీ సిరీస్‌లో మోటో జీ 84 5జీ ప్రారంభ స్మార్ట్‌ ఫోన్‌ కావడం విశేషం. ఈ ఫోన్‌ ధరతో పాటు ఇతర స్పెసిఫికేషన్ల గురించి ఓ సారి తెలుసుకుందాం. 

ధర, ఆఫర్లు

ధర పరంగా మోటో జీ 84 5జీ ఒకే స్టోరేజ్ వేరియంట్‌లో (12 జీబీ+256 జీబీ) రూ. 19,999కి అందుబాటులో ఉంది. కస్టమర్‌లు బ్యాంక్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల ద్వారా ధరను రూ.18,999కి తగ్గించవచ్చు. అదనంగా మోటోరోలా రూ. 399 ప్రీపెయిడ్ ప్లాన్‌కు వర్తించే రూ.5,000 వరకు విలువైన ప్రయోజనాలను అందించడానికి జియోతో జత కలిసింది.

ముఖ్యమైన ఫీచర్లు

మోటో జీ 84 5 జీ ఫోన్‌ 50 మెగాపిక్సెల్ కెమెరా, 256 జీబీ నిల్వతో పాటు 30 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు మద్దతుగా ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్‌ ఫోన్‌తో పాటు 33 వాట్స్‌ ఫాస్ట్‌ చార్జర్‌ను కంపెనీ అందిస్తుంది. ఈ ఫోన్ వివా మెజెంటా, మార్ష్‌మాల్లో బ్లూ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ఫోన్లు విలక్షణమైన లెదర్ ముగింపును కలిగి ఉంటాయి. మిడ్‌నైట్ బ్లూ ఆప్షన్‌లో గ్లాస్ లాంటి పీఎంఎంఏ మెటీరియల్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

డిస్ప్లే, హార్డ్‌వేర్

మోటో జీ 84 5జీ 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్‌ వరకు గరిష్ట ప్రకాశంతో 10 బిట్ 6.5 అంగుళాల పోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ముఖ్యంగా డిస్ప్లే డీసీఐ పీ 3 100 శాతం రంగులను అందిస్తుంది. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో ప్రత్యేకంగా రూపొందించారు. 

కెమెరా, సాఫ్ట్‌వేర్

ఈ ఫోన్‌ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌తో పని చేస్తుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ఓఐఎస్‌ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఫోన్‌ సెకండరీ కెమెరా ఆకట్టుకునే మాక్రో షాట్‌లను క్యాప్చర్ చేయగలదు. సెల్ఫీ ప్రియుల కోసం 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 13తో  పని చేస్తుంది. ఈ ఫోన్‌లో మోటో కనెక్ట్‌ యాప్‌తో సహా పలు యాజమాన్య యాప్‌లు, ఫీచర్‌లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇది డాల్బీ అట్మోస్ స్పీకర్లను, మోటో స్పేషియల్ ఆడియోకు మద్దతును కలిగి ఉంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..