- Telugu News Photo Gallery Technology photos Motorola launches Moto G14 Smart phone in 2 new colours, Check here for features and price details
Moto G14: మరో రెండు కొత్త కలర్స్‌లో మోటో జీ14.. రూ. పది వేలకే ఇన్ని ఫీచర్స్ ఏంటి అసలు
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థ మోటరోలా ప్రస్తుతం బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇందులో భాగంగా తీసుకొచ్చిందే మోటీ జీ 14. ఆగస్టులో మార్కెట్లోకి తీసుకొచ్చిన ఈ ఫోన్స్ హాట్ కేక్స్‌లా అమ్ముడుపోయాయి. దీనికి కారణం.. ఈ ఫోన్ ధరే. కేవలం రూ. 10 వేలలో మంచి ఫీచర్స్‌తో తీసుకురావడంతో యూజర్లు పెద్ద ఎత్తున ఈ ఫోన్‌కు అట్రాక్ట్ అయ్యారు. దీంతో కంపెనీ కూడా యూజర్లను మరింత అట్రాక్ట్ చేసే క్రమంలో తాజాగా ఈ ఫోన్‌ను మరో రెండు కొత్త కలర్స్‌లో తీసుకొచ్చింది. మరి ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..
Updated on: Aug 24, 2023 | 5:11 PM

మోటరోలా ఈ నెల ప్రారంభంలో మోటో జీ 14 స్మార్ట్ ఫోన్‌ను స్టీల్ గ్రే, స్కై బ్లూ ఆప్షన్స్‌లో తీసుకొచ్చింది. అయితే తాజాగా బటర్ క్రీమ్, పాలెలిలాక్ కలర్స్‌లో తీసుకువచ్చింది. ఆగస్టు 24వ తేదీ నుంచి ఈ కొత్త ఫోన్స్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చాయి.

ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే మోటీ జీ14 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999కి అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది.

బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 20 వాట్స్ టర్బో పవర్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇచ్చారు. 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్‌ను ఇచ్చారు.

ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ + డిస్‌ప్లేను ఇచ్చారు. 1080×2400 పిక్సెల్స్ ఎల్సీడీ డిస్ ప్లే విత్ 405 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ ఈ స్క్రీన్ ప్రత్యేకత. ఇక ఈ ఫోన్ అక్టాకోర్ యూనిసోక్ టీ616 ఎస్వోసీ చిప్‌సెట్‌తో రన్ చేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ఇందులో 50 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీ, ఫేస్ డిటెక్షన్ ఆటో ఫోకస్ వంటి స్పెషల్ ఫీచర్స్‌ను ఇచ్చారు. సెల్ఫీల కోసం 2 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.





























