Moto Tab G84: భారత మార్కెట్లోకి మోటోరొలో నుంచి ట్యాబ్‌.. ఫీచర్స్‌, ధరపై ఓ లుక్కేయండి..

నెట్టింట వైరల్‌ అవుతోన్న సమాచారం ఆధారంగా ఈ కొత్త ట్యాబ్‌లో ల్యాండ్‌స్కేప్‌ ఓరియెంటెడ్‌ కెమెరాను ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే ఎల్‌ఈడీ ఫ్లాష్‌ లైట్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ట్యాబ్‌ను మెటాలిక్‌ డ్యూయల్ కలర్‌ డిజైన్‌తో తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇక ఈ ట్యాబ్‌లో...

Moto Tab G84: భారత మార్కెట్లోకి మోటోరొలో నుంచి ట్యాబ్‌.. ఫీచర్స్‌, ధరపై ఓ లుక్కేయండి..
Motorola Moto Tab G84
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 22, 2023 | 12:35 PM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటోరోలో భారత మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను లాంచ్‌ చేయడానికి సిద్ధమవుతోంది. మోటో ట్యాబ్‌ జీ84పేరుతో ఈ ట్యాబ్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో మోటోరోలా నుంచి వచ్చిన మోటో ట్యాబ్‌ జీ70కి కొనసాగింపుగా మోటో ట్యాబ్‌ జీ84ని తీసుకురానున్నారు. కంపెనీ ఈ ట్యాబ్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట వైరల్‌ అవుతోన్న కొన్ని లీక్‌ల ఆధారంగా ఈ ట్యాబ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత ఉండనుంది.? లాంటి విషయాలపై ఓ లుక్కేయండి..

నెట్టింట వైరల్‌ అవుతోన్న సమాచారం ఆధారంగా ఈ కొత్త ట్యాబ్‌లో ల్యాండ్‌స్కేప్‌ ఓరియెంటెడ్‌ కెమెరాను ఇవ్వనున్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే ఎల్‌ఈడీ ఫ్లాష్‌ లైట్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ట్యాబ్‌ను మెటాలిక్‌ డ్యూయల్ కలర్‌ డిజైన్‌తో తీసుకురానున్నారని తెలుస్తోంది. ఇక ఈ ట్యాబ్‌లో జేబీఎల్‌ స్పీకర్స్‌ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఆ సౌండ్‌ డాల్బీ ఆటమ్స్‌కు సపోర్ట్ చేస్తుంది.

ట్యాబ్‌కు కుడివైపు రెండు స్పీకర్లను అందించారు. యూఎస్‌బీ టైప్‌సీ ఛార్జింగ్ పోర్ట్‌ను ఇవ్వనున్నారు. ఇక కెమెరా విషయానికొస్తే ఈ ట్యాబ్‌లో 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాతో పాటు, ఫ్రంట్‌ కెమెరాను కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే 10.6 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారని టాక్‌. మెమోరీ కార్డ్‌ సపోర్ట్‌తో ట్యాబ్‌ ఇంటర్నల్‌ మెమోరీని 1టీబీ వరకు పెంచుకోవచ్చు. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో ఈ ట్యాబ్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఈ ట్యాబ్‌ ధర విషయంపై ఇప్పటి వరకు కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయిన్పటికీ.. రూ. 20 వేల లోపు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో మోటోరోలా విడుదల చేసిన మోటో ట్యాబ్‌ జీ70 ట్యాబ్‌ ధర రూ. 21,99గా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్యాబ్ తో పోల్చితే ప్రస్తుతం రానున్న కొత్త ట్యాబ్ ఫీచర్లు ఎక్కువగా ఉండనున్నట్లు స్పష్టమవుతోంది. అయితే ధర విషయంలో మాత్రం పాత ట్యాబ్ కంటే తక్కువ ధరే ఉండనున్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే