Moto G84 5G: రేపే మోటో జీ84 ఫోన్ లాంచ్.. ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉండబోతున్నాయంటే..?

|

Aug 31, 2023 | 6:32 PM

Moto G84 5G: స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం బడ్జెట్ ఫోన్‌లను తీసుకురావడంలో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీ మోటారోలా ఎప్పుడూ ముందుంటుంది. ఈ మేరకు గతంలో ఎన్నో స్మార్ట్‌ఫోన్లను తన కస్టమర్లకు పరిచయం చేసిన మోటోరోలా మరో బడ్జెట్ ఫోన్‌ని విడుదల చేసేందుకు సిద్ధమైంది. మోటోరోలా నుంచి తాజాగా ‘Moto G84 5G’ పేరుతో వస్తున్న కొత్త స్మార్ట్‌ఫోన్‌ రేపు అంటే సెప్టెంబర్ 1న భారతదేశంలో లాంచ్ కాబోతోంది. ఈ క్రమంలో ఈ మోటో జీ84 స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండబోతున్నాయి..? దీని ధర ఎంత..? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం..

Moto G84 5G: రేపే మోటో జీ84 ఫోన్ లాంచ్.. ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉండబోతున్నాయంటే..?
Moto G84 5G
Follow us on

Moto G84: మొబైల్ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయడంలో మోటోరోలా కంపెనీకి ప్రముఖ స్థానం ఉంది. ఈ మేరకు మోటోరోలా కంపెనీ గతంలో విడుదల చేసిన మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌లో భాగంగా మోటో G84 5జీ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టెంబర్ 1న మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతుంది. మిడ్‌నైట్ బ్లూ, వివా మాగ్నెంటా, మార్ష్‌మాలో బ్లూ కలర్స్‌లో వస్తున్న మోటో G84 5జీ స్మార్ట్‌ఫోన్‌ 256GB 8GB RAM, 256GB 12GB RAM స్టోరేజ్ ఆప్షన్‌లను కలిగి ఉంటుందని సమాచారం. ఈ క్రమంలో 8GB RAM వేరియంట్ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 20 వేలు, అలాగే 12GB RAM వేరియంట్ ధర రూ. 22 వేలు వరకు ఉండవచ్చని ప్రాథమిక అంచనా.

ఇక మోటో G84 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. దీనిలో 120Hz రిఫ్రెష్ రేట్, 1300 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.55-అంగుళాల pOLED డిస్‌ప్లే ఉండనున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 SoC ప్రాసెసర్‌తో పని చేస్తుంది. అలాగే ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్‌కి అందుబాటులో ఉంటుంది. ఇవే కాక ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఐపీ54 రేటింగ్‌తో డస్ట్‌, స్లాష్‌ రెసిస్టెన్స్‌ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

కెమెరా సెటప్ గురించి మాట్లాడాలంటే.. స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో 50MP OIS కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరాతో డబుల్ కెమెరా సెటప్ ఉంది. ఇంకా సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 16 MP ఫ్రంట్ కెమెరా ఉంది. అదనంగా ఈ ఫోన్‌లో 3 ఏళ్ల పాటు సెక్యూరిటీ ఆప్‌డేట్స్ కూడా వస్తాయి. పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ,  30 వాట్స్‌ ఛార్జింగ్ సప్పోర్ట్ కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌లో లభించనున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..