Motorola Edge 20: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతోంది. రోజురోజుకు మార్కెట్లో కొత్త కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ మొబైల్ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి పలు మొబైల్ తయారీ కంపెనీలు. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్స్ ఉండేలా తయారు చేస్తూ విడుదల చేస్తున్నాయి. ఇక తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్ ఉత్పత్తుల తయారీదారు లెనోవో కంపెనీకి చెందిన మోటరోలా భారత మార్కెట్లలోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అదే మోటరోలా ఎడ్జ్ 20. మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ వేరియంట్లు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. మోటరోలా ఎడ్జ్ 20 స్మార్ట్‌ఫోన్లు భారత మార్కెట్లలోకి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్టు అమ్మకాలను జరపనుంది.
మోటరోలా ఎడ్జ్ 20 ను ఆగస్టు 24 న, మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్‌ను ఆగస్టు 27న సేల్ చేయాలని మోటరోలా భావించింది. కాగా ప్రస్తుతం ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను ఓకే రోజున అంటే ఆగస్టు 24 రోజున ఫ్లిప్‌కార్ట్‌లో ప్రి-బుకింగ్స్ జరిపేందుకు మోటరోలా నిర్ణయం తీసుకుంది. మోటరోలా ఎడ్జ్ 20( 8GB RAM + 128GB) ధర రూ. 29,999 ఉండగా, మోటరోలా ఎడ్జ్ 20 ఫ్యూజన్ (6GB RAM + 128GB) ధర రూ. 21,499 గా నిర్ణయించింది.
► ఆండ్రాయిడ్ 11 విత్ మైయూఎక్స్ సపోర్ట్
► 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080×2,400 పిక్సెల్స్) ఓఎల్‌ఈడీ మాక్స్ విజన్ డిస్‌ప్లే
► ఆక్టా-కోర్ క్వాలకం స్నాప్ డ్రాగన్ 778జీ
► 8జీబీ ర్యామ్+128 జీబీస్టోరేజ్
► ట్రిపుల్ రియర్ కెమెరా (108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్,+8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్+16 మెగాపిక్సెల్ సెన్సార్)
► 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
► 4000ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ
► 30 వాట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. టైప్ సీ చార్జర్, 5జీ సపోర్ట్