Jio Vs Airtel: జియో 629 లేదా ఎయిర్‌టెల్ 649 ప్లాన్స్‌లో ఏది బెస్ట్..? రీఛార్జ్ చేసే ముందు తప్పక తెలుసుకోండి..

మీ దగ్గర డ్యూయల్ సిమ్ ఫోన్ ఉండి, అందులో ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో సిమ్స్ వాడుతున్నారా..? అయితే ఈ న్యూస్ మీకోసమే. జియో రూ.629 ప్లాన్, ఎయిర్‌టెల్ రూ.649 ప్లాన్ మధ్య తేడా ఏమిటో మీకు తెలుసా..? రీఛార్జ్ చేసే ముందు ఈ విషయాన్ని మీరు తప్పక తెలుసుకోవాలి.

Jio Vs Airtel: జియో 629 లేదా ఎయిర్‌టెల్ 649 ప్లాన్స్‌లో ఏది బెస్ట్..? రీఛార్జ్ చేసే ముందు తప్పక తెలుసుకోండి..
Jio 629 or Airtel 649

Updated on: Jul 23, 2025 | 4:04 PM

ప్రస్తుతం టెలికామ్ రంగంలో జియో, ఎయిర్‌టెల్ పోటాపోటీగా దూసుకెళ్తున్నాయి. వొడాఫోన్ ఐడియా అంతంతమాత్రంగానే నడుస్తోంది. మీరు రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ సిమ్‌లను ఉపయోగిస్తున్నారా..? అయితే కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి. జియో యొక్క రూ. 629 ప్లాన్ మీకు బెస్ట్‌గా ఉంటుందా..? ఎయిర్‌టెల్ రూ. 649 ప్లాన్‌ బాగుంటుందా అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

జియో 629 ప్లాన్..

ఈ జియో ప్లాన్‌తో మీరు ప్రతిరోజూ 2జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్‌లను పొందుతారు. 56 రోజుల కాల వ్యవధితో ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో మొత్తం 112 GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌ను అపరిమిత 5G డేటా ప్రయోజనంతో పొందుతారు. కంపెనీ ఈ ప్లాన్‌కు ట్రూ 5G అని పేరు పెట్టింది. అదనపు ప్రయోజనాల గురించి మాట్లాడుకుంటే.. ఈ ప్లాన్ జియో అన్‌లిమిటెడ్ ఆఫర్ యొక్క ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది ఈ ఆఫర్ కింద జియో హాట్‌స్టార్ మొబైల్, టీవీకి ఉచిత యాక్సెస్, 50జీబీ ఏఐ క్లౌడ్ స్టోరేజ్‌ను 90 రోజుల పాటు అందిస్తుంది.

ఎయిర్‌టెల్ 649 ప్లాన్

రిలయన్స్ జియో మాదిరిగానే ఎయిర్‌టెల్ యొక్క ఈ ప్లాన్ కూడా ప్రతిరోజూ 2జీబీ హైస్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్ లను అందిస్తుంది. 56 రోజుల కాలవ్యవధితో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. డేటా అయిపోయినప్పటికీ మీరు అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని పొందుతారు. ఈ ప్లాన్ స్పామ్ అలర్ట్, ఉచిత హెలోట్యూన్, పర్‌ప్లెక్సిటీ ప్రో AIకి ఉచిత యాక్సెస్‌ను ఇస్తుంది.

ఏది బెస్ట్..?

జియోతో పోల్చినప్పుడు ఎయిర్‌టెల్‌కు సంబంధించి ఏఐ ఆఫర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఎయిర్‌టెల్ యొక్క ఈ రీఛార్జ్ ప్లాన్ ఏఐ యొక్క ఉచిత సబ్‌స్క్రిప్షన్ కోరుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎయిర్‌టెల్ యొక్క ఈ ప్లాన్‌తో కంపెనీ ఏడాదికి రూ.17 వేల విలువైన పర్‌ప్లెక్సిటీ ప్రోకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తోంది.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..