Meil: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులను వేగవంతం చేసిన మేఘా

|

Aug 06, 2021 | 5:38 PM

పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులను వేగవంతం చేసింది ఏపీ ప్రభుత్వం. అనుకున్న సమయానికే ప్రాజెక్ట్ పూర్తి చేసేలా

Meil: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులను వేగవంతం చేసిన మేఘా
Polavaram
Follow us on

Megha Engineering – Polavaram: పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన 960 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్రం పనులను వేగవంతం చేసింది ఏపీ ప్రభుత్వం. అనుకున్న సమయానికే ప్రాజెక్ట్ పూర్తి చేసేలా పక్కాప్రణాళికతో వడివడిగా అడుగులేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తయితే 194 TMCల నీటిని నిల్వ చేస్తారు. ఇందులో 120 TMCల నీటిని జల విద్యుత్ ఉత్పత్తి, సాగు నీటి అవసరాలకు వినియోగిస్తారు. మిగిలిన 70 TMCల నీటిని నిల్వ చేస్తారు.

గోదావరి నీటిని నిల్వ చేసే అవకాశాలు ఆంధ్రప్రదేశ్‌లో ఒక పోలవరం ప్రాజెక్ట్ దగ్గర తప్ప మరెక్కడా లేవు. సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్ వద్ద నిల్వ అవకాశాలు ఉన్నా అది చాలా తక్కువ. ఈ నేపథ్యంలో పోలవరం వద్ద నీటిని నిల్వ చేసి పలు ప్రయోజనాలకు ఈ నీటిని వినియోగించనున్నారు. అందులో ఈ జల విద్యుత్ కేంద్రం ఒకటి. గోదావరి నదిపై ఏపీలో ఎక్కడా భారీ జల విద్యుత్ కేంద్రాలు లేవు. వున్న ఒకటి, రెండు కూడా చాలా తక్కువ సామర్ధ్యంతో ఉన్నాయి.

అటు పోలవరం ప్రాజెక్టు జలవిద్యుత్ కేంద్రం పనులు ఇప్పటికే శరవేగంగా సాగుతున్నాయి. కీలకమైన జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులను మేఘా ఇంజనీరింగ్ సంస్థ రివర్స్ టెండరింగ్ తరువాత ఈ ఏడాది మార్చి 30న పనులు ప్రారంభించింది. ఇప్పటికే కొండ 18.90 లక్షల క్యూబిక్ మీటర్ల కొండ తవ్వకం పనులను పూర్తి చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.

జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు అనుకున్నసమయానికే పూర్తి చేసి ప్రాజెక్టు ఫలాలను రాష్ట్రప్రజలకు అందించేందుకు ప్రభుత్వ సహాకారంతో పనులను వేగవంతం చేసింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ.

Read also: Ongole RIMS: ఒంగోలు రిమ్స్‌లో దారుణం.. కాంట్రాక్ట్‌ నర్సుపై పేషెంట్‌ బంధువు లైంగిక దాడి