Apple iPhone 12: డెడ్ చీప్‌గా యాపిల్ ఐఫోన్.. కేవలం రూ. 17,399కే కొనొచ్చు.. పూర్తి వివరాలు ఇవి..

|

Sep 15, 2023 | 8:31 AM

యాపిల్ ఐఫోన్ వాడాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే దాని బడ్జెట్ ను చూసి దూరం జరుగుతారు. అలాంటి వారి కోసం ఓ గుడ్ న్యూస్. రూ. 20,000 లోపు ధరలోనే యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేసే సువర్ణావకాశం మీకు అందిస్తోంది ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్. తక్షణ డిస్కౌంట్లు, కార్డ్ ఆఫర్లు, ఎక్స్ చేంజ్ ఆఫర్లతో కలిపి అతి తక్కువ ధరకే రెండు యాపిల్ ఐఫోన్ మోడళ్లను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.

Apple iPhone 12: డెడ్ చీప్‌గా యాపిల్ ఐఫోన్.. కేవలం రూ. 17,399కే కొనొచ్చు.. పూర్తి వివరాలు ఇవి..
Apple Iphone 12
Follow us on

యాపిల్ ఐఫోన్ వాడాలని చాలా మంది కలలు కంటుంటారు. అయితే దాని బడ్జెట్ ను చూసి దూరం జరుగుతారు. అలాంటి వారి కోసం ఓ గుడ్ న్యూస్. రూ. 20,000 లోపు ధరలోనే యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేసే సువర్ణావకాశం మీకు అందిస్తోంది ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్. తక్షణ డిస్కౌంట్లు, కార్డ్ ఆఫర్లు, ఎక్స్ చేంజ్ ఆఫర్లతో కలిపి అతి తక్కువ ధరకే రెండు యాపిల్ ఐఫోన్ మోడళ్లను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆ ఐఫోన్ మోడళ్లేంటి? దానిపై ఆఫర్లేంటి? తెలుసుకుందాం రండి..

రెండు మోడళ్లపై ఆఫర్లు..

ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన ఐఫోన్ మోడల్ ఆపిల్ ఐఫోన్ 12. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సమయంలో కూడా ఈ ఫోన్ కు మంచి స్పందనే లభించింది. అయితే యాపిల్ ఐఫోణ్ 15ని ఇటీవల ప్రారంభించిన యాపిల్ సంస్థ ఈ యాపిల్ ఐఫోన్ 12 తో పాటు యాపిల్ ఐఫోన్ 13 మినీ ఉత్పత్తిని నిలిపివేసింది. అంతేకాక తన అధికారక స్టోర్ నుంచి ఈ రెండు స్మార్ట్ ఫోన్లను తొలగించింది. యాపిల్ ఐఫోన్ 13 మినీ ఫోన్ యాపిల్ లాంచ్ చేసిన చివరి మినీ మోడల్. ఆపిల్ ఐఫోన్ 12, ఆపిల్ ఐఫోన్ 13 మినీ రెండూ ఐకానిక్ ఐఫోన్ మోడల్‌లు. దీంతో రెండు ఫోన్‌లపై ఫ్లిప్ కార్ట్ భారీ ఆఫర్లను అందిస్తోంది.

ఆపిల్ ఐఫోన్ 12 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 49,999గా లిస్టింగ్ చేసి ఉంది. అయితే మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఇక్కడ ఎక్స్ చేంజ్ చేస్తే రూ. 30,600 వరకు తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ యాపిల్ ఐఫోన్ 12 ధర రూ. 19,399కి తగ్గుతుంది. దీనితో పాటు, కొనుగోలుదారులు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ నుంచి ఈఎంఐ లావాదేవీలు చేస్తే రూ. 2000 తగ్గింపును పొందవచ్చు. ఈ ఆఫర్‌లన్నింటితో కలిపి యాపిల్ ఐఫోన్ 12 ను మీరు రూ. 17,399కి కొనుగోలు చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

యాపిల్ ఐఫోన్ 12 స్పెసిఫికేషన్లు ఇవి..

యాపిల్ ఐఫోన్ 12 అనేది ప్రీమియం ఫీచర్లతో కూడిన వ్యాల్యూ ఫర్ మనీ స్మార్ట్‌ఫోన్. 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో వస్తుంది. ఐఫోన్ ఏ14 బయోనిక్ చిప్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది సిరామిక్ షీల్డ్, ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. కెమెరా విషయానికి వస్తే, పరికరం వెనుక భాగంలో 12ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్‌ను పొందుతుంది. ఇది నైట్ మోడ్, 4కే డాల్బీ విజన్ హెచ్డీఆర్ రికార్డింగ్‌తో కూడిన 12ఎంపీ ట్రూ డెప్త్ ఫ్రంట్ కెమెరాను కూడా పొందుతుంది. ఇది నిలువు డ్యూయల్ కెమెరా సెటప్, 64జీబీ నిల్వతో బ్రాండ్ ఈ బ్రాండ్ నుంచి వచ్చిన చివరి ఫోన్.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..