IPad Pro 2022 : ఐప్యాడ్ ప్రో 2022 గురించి తెలుసుకోండి..! ఫీచర్స్ ఏంటి.. ఇండియాలో ధర ఎంత..?

|

Jun 28, 2021 | 9:42 PM

IPad Pro 2022 : ఈ సంవత్సరం స్ప్రింగ్ లోడెడ్ ఈవెంట్‌లో ఐప్యాడ్ ప్రో ఎం1 ప్రకటించారు. ఆపిల్ సొంత సిలికాన్ ఇచ్చిన

IPad Pro 2022 : ఐప్యాడ్ ప్రో 2022 గురించి తెలుసుకోండి..! ఫీచర్స్ ఏంటి.. ఇండియాలో ధర ఎంత..?
Ipad Pro 2022
Follow us on

IPad Pro 2022 : ఈ సంవత్సరం స్ప్రింగ్ లోడెడ్ ఈవెంట్‌లో ఐప్యాడ్ ప్రో ఎం1 ప్రకటించారు. ఆపిల్ సొంత సిలికాన్ ఇచ్చిన మొదటి టాబ్లెట్ ఇది. ఆపిల్ ఇతర ఐప్యాడ్‌లు ఇంకా అప్‌డేట్ కానప్పటికీ పెద్ద సైజు ఐప్యాడ్ ప్రో మోడళ్లను విడుదల చేయవచ్చని కంపెనీ తెలిపింది. కొత్త ఐప్యాడ్ ప్రోను వచ్చే ఏడాది ప్రారంభించవచ్చు. ఐప్యాడ్ ప్రో 2022 కోసం ఆపిల్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను పరీక్షిస్తోంది. కంపెనీ దానిలో OLED డిస్ప్లేని కూడా అందిస్తుందని చెప్పింది. కానీ ప్రస్తుతానికి ఐప్యాడ్ ప్రో 2022 ప్రయోగం చాలా దూరంలో ఉంది. కానీ దీనికి సంబంధించి చాలా విషయాలు లీకవుతున్నాయి.

ఐప్యాడ్ ప్రో ఆపిల్ అత్యంత ప్రీమియం టాబ్లెట్. దీనిలో M1 చిప్‌సెట్ ఇచ్చారు. ఇది కాకుండా ప్రో మోషన్ డిస్ప్లే, 5 జి, సరికొత్త ఎక్స్‌బాక్స్, పిఎస్ 5 కంట్రోలర్‌‌లు ఉన్నాయి. తాజా నివేదిక గురించి మాట్లాడితే ఐప్యాడ్ ప్రో 2022 లో బ్యాక్ గ్లాస్ డిజైన్ ఇవ్వవచ్చు. ఇది ఖచ్చితంగా ఐఫోన్ 12 లాగా ఉంటుంది. సంస్థ వైర్‌లెస్, రివర్స్ ఛార్జింగ్ ఫీచర్స్ అందించగలిగే విధంగా డిజైన్ మార్చబడుతోంది. అయితే కొత్త ఐప్యాడ్ ప్రో 2022 ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని మాత్రమే తెలుస్తోంది. రాబోయే ఐప్యాడ్ ప్రో కోసం మాగ్‌సేఫ్‌ను కూడా పరీక్షిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

వైర్‌లెస్ లేదా రివర్స్ ఛార్జింగ్ చాలా పెద్ద విషయం. ఎందుకంటే ఈ ఆపిల్ ఉత్పత్తి చాలా భిన్నంగా ఉంటుంది. ఇంతకుముందు ఐఫోన్ 11 గురించి కూడా ఇటువంటి ప్రకటన జరిగింది కానీ అది ఎప్పుడూ నిజం కాలేదు. వైర్‌లెస్ ఛార్జింగ్ ప్రస్తుత వైర్డు సిస్టమ్ కంటే వేగంగా లేదు. కానీ ప్రీమియం ఉత్పత్తికి ఇది శక్తివంతమైన లక్షణం. ఐప్యాడ్ ప్రోను 2022 సంవత్సరంలో ప్రారంభించవచ్చు. అయితే దాని అధికారిక తేదీ ఇంకా వెల్లడించలేదు. కానీ 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రో బేస్ వేరియంట్ అంటే 128 జిబి స్టోరేజ్ ధర 99,900 రూపాయలు. కాగా టాప్ స్పెక్ ఫీచర్ ధర 1,98,900 రూపాయలు. మరోవైపు, 11 అంగుళాల డిస్ప్లే ధర 71,900 రూపాయలు, టాప్ మోడల్ కోసం మీరు 1,70,900 రూపాయలు చెల్లించాలి.

Corona Vaccine Cures Paralysis : కరోనా టీకా తీసుకుంటే పక్షవాతం నయమవుతుందా..! మద్యప్రదేశ్‌లో ఇదే జరిగింది..

ఇప్పుడు గూగుల్, ఫేస్ బుక్ ల వంతు..సమన్లు జారీ చేసిన పార్లమెంటరీ కమిటీ

Shopping Tips: మహిళలు లెదర్ హ్యాండ్ బ్యాగ్ కొంటున్నారా ? అసలైన బ్రాండ్.. ఫేక్ బ్రాండ్ మధ్య తేడాలు తెలుసుకోండిలా..