Lava O2 Launch: రూ. 10వేలలోనే స్టన్నింగ్ స్మార్ట్‌ ఫోన్‌.. లావా నుంచి కొత్త ఫోన్‌..

|

Mar 19, 2024 | 8:07 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం లావా మార్కెట్లోకి లావా ఓ2 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. కంపెనీ ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను గ్రీన్ కలర్‌వే ఆప్షన్‌లో తీసుకురానున్నారు. కెమెరా విషయాకొస్తే ఇందులో ఫోన్ వెనకవైపు...

Lava O2 Launch: రూ. 10వేలలోనే స్టన్నింగ్ స్మార్ట్‌ ఫోన్‌.. లావా నుంచి కొత్త ఫోన్‌..
Lava O2
Follow us on

ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లు లాంచ్‌ అవుతున్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నారు. మరీ ముఖ్యంగా రూ. 10వేల లోపు మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం లావా మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. లావా ఓ2 పేరుతో మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం లావా మార్కెట్లోకి లావా ఓ2 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. కంపెనీ ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను గ్రీన్ కలర్‌వే ఆప్షన్‌లో తీసుకురానున్నారు. కెమెరా విషయాకొస్తే ఇందులో ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ ఉండనుంది. కెమెరా మాడ్యూల్‌లో కాస్త మార్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది.

ఇక ఈ ఫోన్‌ యూఎస్‌బీ టైప్‌ సీ పోర్టుతో రానుంది. అలాగే ఇందులో స్పీకర్‌ గ్రిల్ ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. అమెజాన్‌లో ఈ ఫోన్‌ను లిస్ట్ చేశారు. అమెజాన్‌లో పేర్కొన్న ఫీచర్ల ఆధారంగా ఇందులో 6.5 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ కాగా, ముందువైపు హోల్ పంచ్ కటౌట్లో సెల్ఫీ కెమెరాను అందించనున్నారు. ఇక మొబైల్ వెనకభాగాన్ని ఏజీ గ్లాస్‌తో డిజైన్‌ చేశారు.

ఇక ఈ ఫోన్‌ ఆక్టాకోర్ యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌పై పనిచేయనుంది. 8 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. ఫోన్‌కు సైడ్‌ భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 18 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..