Lava Smart Watch: స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లో లావా ఆరంగేట్రం.. తక్కువ ధరలో మెంటల్ ఎక్కే ఏఐ ఫీచర్లు

ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌లను అధికంగా ఇష్టపడడంతో అన్ని కంపెనీలు ఎప్పకటిప్పుడు సరికొత్త స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ లావా తన మొదటి స్మార్ట్‌వాచ్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నారు. భారతదేశంలోని యూజర్లకు ఆకట్టుకోవడానికి లావా ప్రత్యేకంగా స్మార్ట్‌వాచ్‌ను తయారు చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ కొన్ని ఏఐ ఫీచర్లు ఉంటాయని నివేదికలు వెల్లడిస్తున్నారు. అలాగే లావా మొదటి స్మార్ట్‌వాచ్ ధర రూ. 4,000 కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Lava Smart Watch: స్మార్ట్‌వాచ్ మార్కెట్‌లో లావా ఆరంగేట్రం.. తక్కువ ధరలో మెంటల్ ఎక్కే ఏఐ ఫీచర్లు
Smartwatch

Updated on: Feb 28, 2024 | 1:00 PM

ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ యాక్ససరీస్ వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యువత ఈ స్మార్ట్ యాక్ససరీస్‌ను వినియోగించడానికి ఇష్టపడడంతో పలు కంపెనీలు సరికొత్త ఫీచర్స్‌తో అధునాతన స్మార్ట్ యాక్ససరీస్‌ను లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌లను అధికంగా ఇష్టపడడంతో అన్ని కంపెనీలు ఎప్పకటిప్పుడు సరికొత్త స్మార్ట్ వాచ్‌లను రిలీజ్ చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ లావా తన మొదటి స్మార్ట్‌వాచ్‌ను భారతదేశంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోందని పలు నివేదికలు వెల్లడిస్తున్నారు. భారతదేశంలోని యూజర్లకు ఆకట్టుకోవడానికి లావా ప్రత్యేకంగా స్మార్ట్‌వాచ్‌ను తయారు చేస్తుంది. ఈ స్మార్ట్‌వాచ్ కొన్ని ఏఐ ఫీచర్లు ఉంటాయని నివేదికలు వెల్లడిస్తున్నారు. అలాగే లావా మొదటి స్మార్ట్‌వాచ్ ధర రూ. 4,000 కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. లావా స్మార్ట్ వాచ్ గురించి మరిన్ని వివరాలను ఓ సారి తెలుసుకుందాం. 

లావా స్మార్ట్ వాచ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు ప్రముఖ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ల ద్వారా అందుబాటులో ఉంటుంది. అయితే స్మార్ట్‌వాచ్‌కు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో లేవు. ఈ లాంచ్‌తో లావా ఫైర్-బోల్ట్, నాయిస్, బోట్ వంటి ఇతర స్మార్ట్‌వాచ్ బ్రాండ్‌లతో పోటీపడనుంది. లావా ఇప్పటి వరకు బేసిక్ ఫోన్‌లతో పాటు స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించింది.  అలాగే ఈ వాచ్ ఏఐ ఫీచర్లతో వస్తుందని నివేదికల ద్వారా వెల్లడి కావడంతో యువతను కచ్చితంగా ఈ స్మార్ట్ వాచ్ యువతను ఆకట్టుకుంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.  

ఆకట్టుకుంటున్న యువ3

లావా ఇటీవల తన యువ 3 స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. కంపెనీ నుండి వచ్చిన తాజా స్మార్ట్‌ఫోన్ రూ. 7,000 ధర విభాగంలో అధునాతన డిజైన్, మెరుగైన పనితీరును అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. 64 జీబీ + 128 జీబీ అమెజాన్ ఇండియా, లావా ఇ-స్టోర్ మరియు ఇతర రిటైల్ స్టోర్‌లలో ప్రారంభ ధర రూ.6,799. ఇది 6.5-అంగుళాల హెచ్‌డీ ప్లస్ పంచ్-హోల్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే యూనిసాక్ టీ 606 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ చిప్‌సెట్ 4 జీబీ ర్యామ్‌కు జత చేశారు. అలాగే 4 జీబీ వర్చువల్ ర్యామ్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత. ఆండ్రాయిడ్ 13 ద్వారా పని చేసే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 అప్‌గ్రేడ్‌తో వస్తుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో పని చేసే ఈ ఫోన్ 13 ఎంపీ ట్రిపుల్ ఏఐ వెనుక కెమెరా సెటప్‌తో పాటు 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్ టైప్- సీ యూఎస్‌బీ కేబుల్‌తో వస్తుంది. అలాగే అధునాతన ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ ఈ ఫోన్ ప్రత్యేకత అని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us