Jio Fiber Vs Airtel Xtream Fiber: బ్రాడ్‌బ్యాండ్లలో టాప్ బ్రాండ్ ఏది? జియో, ఎయిర్‌టెల్‍‌లలో మధ్యే పోటీ? ప్లాన్లు, ప్రయోజనాలు ఇవిగో..

|

Sep 22, 2023 | 7:30 AM

రిలయన్స్ జియో ఫైబర్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఫైబర్ పేరిట మార్కెట్లో బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా రెండూ కూడా ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ఇంటర్ నెట్ కనెక్షన్లు అందిస్తాయి. మరీ ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది అనువైన బడ్జెట్లో ఉంటుంది? ఏది మంచి నాణ్యమైన ఇంటర్ నెట్ ను అందిస్తుంది? వాటిల్లోనూ ప్లాన్లు ఏంటి? ఇంటర్ నెట్ స్పీడ్ ఎంత ఉంటుంది? తెలుసుకోవాలనుకుంటే ఈ కథనం పూర్తిగా చదవండి.

Jio Fiber Vs Airtel Xtream Fiber: బ్రాడ్‌బ్యాండ్లలో టాప్ బ్రాండ్ ఏది? జియో, ఎయిర్‌టెల్‍‌లలో మధ్యే పోటీ? ప్లాన్లు, ప్రయోజనాలు ఇవిగో..
Airtel Fiber Vs Reliance Jio Fiber
Follow us on

మన దేశంలోని టెలికాం రంగంలో టాప్ అంటే వెంటనే గుర్తొచ్చేవి ఎయిర్ టెల్ అలాగే రిలయన్స్ జియో. రెండింటి మధ్య హోరాహోరీ పోరు సాగుతుంటుంది. చవకైన ప్లాన్లతోపాటు అధునాతన ఫీచర్లతో దూసుకొచ్చిన రిలయన్స్ జియోకి పోటీగా నిలదొక్కుకొని నిలబడింది ఎయిర్ టెల్ మాత్రమే. నాణ్యమైన నెట్ వర్క్ కు ఇది పెట్టింది పేరు. అయితే ఈ రెండూ కేవలం సెల్ ఫోన్ నెట్ వర్క్ కు మాత్రమే కాక బ్రాండ్ బాండ్ ఇంటర్ నెట్ ప్రోవైడర్లుగానూ టాప్ ప్లేస్ కోస పోటీపడుతున్నాయి. రిలయన్స్ జియో ఫైబర్, ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఫైబర్ పేరిట మార్కెట్లో బ్రాడ్ బ్యాండ్ సేవలను అందిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా రెండూ కూడా ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ ఇంటర్ నెట్ కనెక్షన్లు అందిస్తాయి. మరీ ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది అనువైన బడ్జెట్లో ఉంటుంది? ఏది మంచి నాణ్యమైన ఇంటర్ నెట్ ను అందిస్తుంది? వాటిల్లోనూ ప్లాన్లు ఏంటి? ఇంటర్ నెట్ స్పీడ్ ఎంత ఉంటుంది? తెలుసుకోవాలనుకుంటే ఈ కథనం పూర్తిగా చదవండి. ఒకవేళ మీరు ఏదైనా ఫైబర్ నెట్ కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటే ఇవి బాగా ఉపయోగపడుతుంది. అస్సలు మిస్ అవ్వొద్దు.

రిలయన్స్ జియో ఫైబర్ ప్లాన్లు..

జియో ఫైబర్ లో మీరు నెలవారీ ప్రీ పెయిడ్ ప్లాన్ 30ఎంబీపీఎస్ నుంచి 1జీబీపీఎస్ మధ్య ఎంపిక చేసుకోవచ్చు. ఈ ప్లాన్లన్నీ అన్ లిమిటెడ్. కాబట్టి లార్జ్ సైజ్ ఉన్న ఫైళ్లను కూడా మీరు టెన్షన్ లేకుండా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతేకాక కొన్ని ప్లాన్లు పలు అదనపు ప్రయోజనాలతో కూడా వస్తాయి. పలు స్ట్రీమింగ్ సర్వీస్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్లు వాటిల్లో ఉంటాయి.

  • 30ఎంబీపీఎస్ స్పీడ్ తో ప్రారంభమయ్యే జియో ఫైబర్ తొలి ప్లాన్ రూ. 399 నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో అపరిమిత ఇంటర్ నెట్ యాక్సెస్ ఉంటుంది.
  • ఆ తర్వాత 100ఎంబీపీఎస్ స్పీడ్ తో రూ.699 ప్లాన్ ఉంటుంది. దీనిలో కూడా అన్ లిమిటెడ్ ఇంటర్ నెట్ ఆఫర్ ఉంటుంది.
  • మూడోది 150ఎంబీపీఎస్ స్పీడ్ తో వస్తుంది. రూ.999తో దీనిని తీసుకుంటే నెల వరకూ అపరిమిత ఇంటర్ నెట్ ను వినియోగించుకోవచ్చు. అంతే కాక నెల రోజుల పాటు అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, వూట్, సోనీలివ్, జీ5, జియో సినిమా, డిస్కవరీ ప్లస్, లయన్స్ గేట్ ప్లే, ఆల్ట్ బాలాజీ వంటి 18 ఓటీటీ యాప్ లకు ఉచిత సబ్ స్క్రిప్షన్ పొందొచ్చు.
  • దీని తర్వాత 300ఎంబీపీఎస్ ప్లాన్లో 19 ఓటీటీ యాప్స్ ఉచితంగా ఆస్వాదించవచ్చు. దీనిలో నెట్ ఫ్లిక్స్ కూడా యాడ్ అవుతుంది. దీని ధర రూ. 14,99గా ఉంది. అలాగే 500ఎంబీపీఎస్ ప్లాన్ లో 300ఎంబీపీఎస్ ఉండే అన్ని బెనిఫిట్స్ వస్తాయి. కానీ నెట్ స్పీడ్ కాస్త ఎక్కువ ఉంటుంది. దీని ధర రూ, 2,499గా ఉంటుంది.

అత్యధిక ఇంటర్ నెట్ వేగం1జీబీపీఎస్ తో వచ్చే ప్లాన్లను టైర్ 2గా విభజించారు. దీనిలో రెండు ప్లాన్లు వస్తాయి. మొదటి వచ్చేసరికి రూ. 3,999గా ఉంటుంది. రెండోది రూ. 8,499గా ఉంటుంది. దీనిలో 6,600జీబీ డేటా మాత్రమే వినియోగించుకోగలుతారు. ఈ టైర్ 2 ప్లాన్లు రిలయన్స్ జియో ఫైర్ యూసేజ్ పాలసీ(ఎఫ్‌యూపీ)తో వస్తాయి. దీనివల్ల అన్ లిమిటెడ్ డేటా 3,300జీబీ వద్ద నిలిచిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఎయిర్‌టెల్ ఎక్స్‪‌ట్రీమ్ ఫైబర్ ప్లాన్స్..

దీనిలో ప్లాన్లు 40ఎంబీపీఎస్ నుంచి 1జీబీపీఎస్ వరకూ వరకూ ఉంటాయి. కొన్ని రకాల పాన్లలకు అదనపు చార్జీలు ఉంటాయి. వాటిల్లో ప్రత్యేకంగా టీవీ బాక్స్ ఇస్తారు. దీనితో 350 టీవీ చానల్స్ కూడా వీక్షించవచ్చు.

  • 40ఎంబీపీఎస్ వేగంతో రెండు ప్లాన్లు వస్తాయి. రూ. 499, రూ. 699(టీవీ బాక్స్). ఈ రెండింటిలోనూ నెల వరకూ అపరిమిత ఇంటర్ నెట్ ను వినియోగించుకోవచ్చు. అలాగే ఒక సంవత్సరం వరకూ ఎక్స్‪‌ట్రీమ్ ప్రీమియం, వింక్ ను ఆస్వాదించవచ్చు.
  • 100ఎంబీపీఎస్ వేగంతో వచ్చే ప్లాన్ రూ. 799 ఉంటుంది. దీనిలో ప్రయోజనాలు పై రెండు ప్లాన్ల మాదిరిగానే ఉంటాయి. అయితే ఇందులో టీవీ బాక్స్ ఉండదు.
  • ఆ తర్వాత వస్తున్న ప్లాన్ 200ఎంబీపీఎస్. దీనిలో రెండు ప్లాన్లు ఉన్నాయి. రూ. 999, రూ. 1,099(టీవీ బాక్స్) ఇది ఒక సంవత్సరం పాటు అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి 10 ఓటీటీ యాప్స్ ఉచితంగా వినియోగించుకోవచ్చు. డేటా అన్ లిమిటెడ్ ఉంటుంది.
  • అలాగే 300ఎంబీపీఎస్ ప్లాన్లు రూ. 14,98, రూ. 1,599(టీవీ బాక్స్)తో వస్తాయి. దీనిలో పైన పేర్కొన్న పది ఓటీటీలతో పాటు నెట్ ఫ్లిక్స్(స్టాండర్డ్) కూడా వినియోగించుకోవచ్చు.
  • చివిరిగా 1జీబీపీఎస్ ప్లాన్ రూ. 3,999గా ఉంటుంది. దీనిలో 300ఎంబీపీఎస్ ప్లాన్లో ఉన్న మాదిరిగా అన్ని ప్రయోజనాలు ఉంటాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..