AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ బ్యాటరీ, సూపర్ పర్ఫామెన్స్‌తో ఐకూ Z11! ధర, పూర్తి వివరాలతో మతిపోగొట్టేస్తోంది

iQOO Z11 Smartphone.. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ భారత మార్కెట్లోకి మరొక పవర్ ప్యాక్డ్ ఫోన్‌ను తీసుకొచ్చింది. తమ పాపులర్ Z సిరీస్‌లో భాగంగా సరికొత్త మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. మంచి పెర్ఫార్మెన్స్, సూపర్ డిస్‌ప్లే, మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు. దీని పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భారీ బ్యాటరీ, సూపర్ పర్ఫామెన్స్‌తో ఐకూ Z11! ధర, పూర్తి వివరాలతో మతిపోగొట్టేస్తోంది
Iqoo Z11 Smartphone.
Nikhil
|

Updated on: Aug 22, 2026 | 7:10 AM

Share

మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న ఐకూ సంస్థ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అద్భుతమైన ఫీచర్లు, భారీ బ్యాటరీ కెపాసిటీతో వస్తున్న ఈ కొత్త మోడల్ టెక్ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీని ధర, వేరియంట్లు మరియు ఇతర ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం.

డిస్‌ప్లే విశేషాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ (iQOO) భారత మార్కెట్లోకి మరొక పవర్ ప్యాక్డ్ ఫోన్‌ను తీసుకొచ్చింది. తమ పాపులర్ Z సిరీస్‌లో భాగంగా iQOO Z11 మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. మంచి పెర్ఫార్మెన్స్, సూపర్ డిస్‌ప్లే, మైండ్ బ్లోయింగ్ బ్యాటరీ లైఫ్ కోరుకునే వారిని లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను రూపొందించారు. ఈ iQOO Z11 ఫోన్ మొత్తం 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది.

ప్రారంభ వేరియంట్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ ధర రూ.34,999 కాగా, 8GB + 128GB ధర రూ.39,999గా ఉంది. ఇక 8GB + 256GB వేరియంట్ రూ.44,999కి, టాప్ ఎండ్ 12GB + 256GB మోడల్ రూ.49,999కి లభిస్తాయి. లాంచ్ ఆఫర్ కింద ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ.3,000 వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్, రూ.1,000 కూపన్ లభిస్తాయి. ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఈఎమ్‌ఐ సదుపాయం కూడా ఉంది.

ఈ ఫోన్ ఆగస్టు 25న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్, ఐకూ ఇండియా వెబ్‌సైట్, రిటైల్ స్టోర్లలో విక్రయానికి రానుంది. iQOO Z11 ఫోన్ 6.83 అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. గేమింగ్, వీడియో చూసే అనుభవాన్ని పెంచడానికి 144Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 2,000 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ చేస్తుంది. కంటికి రక్షణగా SGS సర్టిఫికేషన్లు కూడా ఉన్నాయి. భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ ఫోన్ కేవలం 7.99mm మందంతో, 199 గ్రాముల బరువుతో చాలా స్లిమ్‌గా డిజైన్ చేశారు. దానికి తోడు నీరు, దుమ్ము నుంచి రక్షణ కోసం IP68, IP69 రేటింగ్స్ ఇచ్చారు.

భారీ బ్యాటరీ బ్యాకప్

ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7500 టర్బో ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. ఫోన్ వేడెక్కకుండా చూడటానికి జెడ్ సిరీస్‌లోనే తొలిసారిగా 3,800 చదరపు మిమీ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను అమర్చారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత అరిజిన్ ఓఎస్ 6పై నడిచే ఈ ఫోన్‌కు 3 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్స్, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్ ఇస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

ఫోన్ వెనుక వైపు OIS సపోర్ట్ ఉన్న 50MP సోనీ IMX882 మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా ఉంది. అలాగే సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. రెండింటిలోనూ 4K వీడియోలు రికార్డ్ చేయవచ్చు. ఇక ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 7,050mAh భారీ బ్యాటరీ. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలదు. బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్, మంచి పెర్ఫార్మెన్స్ కోరుకునే వారికి ఇది సరైన ఎంపిక.

Follow Us