
iPhone: మీరు బహుశా చాలా సంవత్సరాలుగా ఐఫోన్‌లను వాడుతూనే ఉంటారు. కానీ చిత్రంలో మీ హ్యాండ్‌సెట్‌పై కనిపించే ఆ గీత ఎందుకు ఉందో అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీలో చాలామంది దానిని ఒక డిజైన్‌గా పొరబడి ఉండవచ్చు. కానీ అది డిజైన్ కాదు. అది మీ ఫోన్‌లోని అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటి. ఈ రోజు ఫోన్ బాడీ లోపల కాకుండా బయట ఒక గీతలా కనిపించే ఆ భాగం గురించే తెలుసుకుందాం.
ఆపిల్ ఐఫోన్ బాడీపై ఏదైనా ఉంటే దానికి ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. ఆ గీతల అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అవి కేవలం ఫోన్ డిజైన్ కోసం మాత్రమే కాదు, అవి మీ ఐఫోన్‌లోని అత్యంత ముఖ్యమైన భాగాలలో ఒకటైన యాంటెన్నా బ్యాండ్‌లుగా కూడా పనిచేస్తాయి. ఐఫోన్‌లోని ఈ యాంటెన్నా లైన్లు ఫోన్ సెల్యులార్ (మొబైల్ నెట్‌వర్క్), బ్లూటూత్, వై-ఫై సిగ్నల్‌లను పంపడానికి సహాయపడతాయి. సులభంగా చెప్పాలంటే ఫోన్‌కు సిగ్నల్‌లను ప్రసారం చేయడంలో సహాయపడటానికి ఈ యాంటెన్నా బ్యాండ్‌లు అందించారు.
లోహం రేడియో ఫ్రీక్వెన్సీలను అడ్డుకుంటుంది లేదా గణనీయంగా బలహీనపరుస్తుంది. ఆపిల్ యాంటెన్నా బ్యాండ్‌ను ఐఫోన్ వెలుపల ఉంచుతుంది. ఈ కారణంగానే ఈ బ్యాండ్‌ను ఫోన్ లోపల కాకుండా ఫోన్ బాడీపై ఉంచుతారు. ఇది సిగ్నల్ ప్రసారం సజావుగా జరగడానికి ఫోన్ పనితీరు నిరాటంకంగా ఉండటానికి, అలాగే హ్యాండ్‌సెట్, వై-ఫై లేదా సెల్యులార్ నెట్‌వర్క్ వాడకం మరింత సులభతరం కావడానికి దోహదపడుతుంది.
ఇది కూడా చదవండి: Kitchen Tips: వర్షాకాలంలో బియ్యంకు పురుగు పడుతోందా? ఇలా చేయండి.. అద్భుతమైన ట్రిక్స్!
ఇది కూడా చదవండి: Gold Price Today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు.. తులం ధర ఎంత ఉందో తెలుసా..?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి