IPhone 17: ఆపిల్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఆర్డర్‌ చేసిన అరగంటలలోనే ఐఫోన్‌ డెలివరీ.. ఎలానో తెలుసా?

ఇటీవలే భారత్‌ మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్‌ 17 సిరీస్‌ను మీరు కూడా కొనాలనుకుంటున్నారా? అయితే ఈ గుడ్‌న్యూస్ మీకోసమే. ఇకపై మీరు ఫోన్‌ కొనాలంటే స్టోర్‌కు వెళ్లి క్యూ‌లో నిల్చోవడం, ఆన్‌లైల్‌ ఆర్డర్‌ చేసి వారం రోజుల పాటు వెయిట్‌ చేయాల్సిన అవసరం లేదు. కేవలం 10 నిమిషాల్లోనే మీరు బ్లింకిట్‌ ద్వారా ఐఫోన్‌ను పొందవచ్చు.

IPhone 17: ఆపిల్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. ఆర్డర్‌ చేసిన అరగంటలలోనే ఐఫోన్‌ డెలివరీ.. ఎలానో తెలుసా?
Iphone 17

Updated on: Sep 20, 2025 | 8:27 PM

ఇటీవలే ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఆపిల్ తన కొత్త ఐఫోన్స్ 17 సీరీస్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఐఫోన్‌ ఇటీవలే భారత మార్కెట్‌లో కూడా అందుబాటులోకి వచ్చేశాయి. దీంతో ఈ ఫోన్స్‌ కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఐఫోన్‌ స్టోర్స్‌ దగ్గర బారులు తీరుతున్నారు. అయితే ఇలా ఇబ్బంది పడకుండా.. స్టోర్‌కు వెళ్లాల్సిన అవసం లేకుండా.. మీ ఇంటికే ఫోన్‌ తీసుకొచ్చి ఇచ్చే సదుపాయాన్ని ప్రముఖ గ్రోసరీస్ డెలివరీ సంస్థ బ్లింకిట్ తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు బ్లింకిట్‌ ద్వారా కేవలం 10 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే ఆపిల్ ఐఫోన్ 17 ఫోన్‌లను పొందవచ్చు.

ఈ విషయాన్ని నేరుగా బ్లింకిట్‌ సంస్థనే ప్రకటించింది. మీరు ఈ ఫోన్‌లను ఆపిల్ వెబ్ సైట్, స్టోర్స్‌లో లభించే ధరలకే.. ఈ బ్లింకిట్ లో కూడా పొందవచ్చు. అంటే, మీరు ఎలాంటి అదనపు అమౌంట్ చెల్లించకుండానే ఆపిల్ ఫోన్లను ఇంటి దగ్గర నుండే ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఫోన్‌ను ఆర్డర్ చేసుకున్న 10 నుంచి 30 నిమిషాల లోపే మీ ఆర్డర్ మీ ఇంటికి చేరుతుంది. మీ దాన్ని పూర్తి పరిశీలించి దాన్ని తీసుకోవచ్చు. కేవలం ఫోన్‌లు మాత్రమే కాదు.. ఆపిల్‌ ఇతర ఉత్పత్తులను కూడా బ్లింకిట్‌లో పొందచ్చని సంస్థ పేర్కొంది.

అయితే మీరు ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తించుకోవాలి.. బ్లింకిట్‌ ఈ సేవలను కేవలం ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంచినట్టు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ సేవలను అన్ని నగరాల్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్టు పేర్కొంది.

మరిన్ని సైన్స్ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.