iPhone 15 Series Launch: మంగళవారం నాడు యాపిల్ ఐఫోన్ 15 సిరీస్‌ను లాంచ్ చేయబోతోంది యాపిల్ కంపెనీ. కంపెనీ ఆపిల్ పార్క్‌లో నాలుగు కొత్త ఐఫోన్ మోడల్‌లు iPhone 15, iPhone 15 Plus, iPhone 15 Pro, iPhone 15 Ultra (iPhone 15 Pro Plus)లను లాంచ్ చేస్తుంది. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 10:30 గంటలకు ప్రారంభం కానుంది. Apple iPhone 15 సిరీస్ లాంచ్‌ను Apple కంపెనీకి చెందిన అధికారిక వెబ్‌సైట్, Apple యాప్, Apple YouTube ఛానెల్, Twitter హ్యాండిల్‌లో చూడవచ్చు. కొత్త యాపిల్ ఐఫోన్లకు సంబంధించి పలు వివరాలు ఇప్పటికే వెల్లడయ్యాయి. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం..
వాచ్ 9 సిరీస్‌ను Apple ఈవెంట్‌లో ప్రారంభించవచ్చు. ఇది 41mm, 45mm డయల్ సైజులలో వస్తుంది. దీనితో పాటు, యాపిల్ వాచ్ అల్ట్రా 2, వాచ్ SE లను కూడా ప్రారంభించవచ్చు.
ఇదే సమయంలో Apple USB టైప్ C ఛార్జింగ్ పోర్ట్‌తో కొత్త AirPods ప్రో సిరీస్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. బడ్స్ ప్రో వంటి ఫీచర్లు వీటిలో అందించబడతాయి. ఈ సిరీస్‌లో AirPods Pro, AirPods Pro Max మోడల్‌లు ఉంటాయి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..