Invisible Phone Number: ఫోన్‌లో ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయ్యారంటే.. ఇతరులకు మీ మొబైల్‌ నెంబర్‌ కనిపించకుండా కాల్ చేయవచ్చు..

|

Jan 18, 2023 | 6:31 AM

మన ఫోన్‌ నెంబర్‌ ఇతరులకు కనిపించకుండా కూడా ఫోన్‌ కాల్స్‌ చేయవచ్చని మీకు తెలుసా..! అంటే మన ఫోన్‌కు ఎవరైనా కాల్‌ చేస్తే వాళ్ల నెంబర్‌ కనిపిస్తుంది. అదే మనం ఎవరికైనా కాల్‌ చేస్తే వాళ్లకు మన నెంబర్‌ కనిపించదు..

Invisible Phone Number: ఫోన్‌లో ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయ్యారంటే.. ఇతరులకు మీ మొబైల్‌ నెంబర్‌ కనిపించకుండా కాల్ చేయవచ్చు..
Invisible Phone Number
Follow us on

మన ఫోన్‌ నెంబర్‌ ఇతరులకు కనిపించకుండా కూడా ఫోన్‌ కాల్స్‌ చేయవచ్చని మీకు తెలుసా..! అంటే మన ఫోన్‌కు ఎవరైనా కాల్‌ చేస్తే వాళ్ల నెంబర్‌ కనిపిస్తుంది. అదే మనం ఎవరికైనా కాల్‌ చేస్తే వాళ్లకు మన నెంబర్‌ కనిపించదు. అయినా ఫోన్‌ మాట్లాడవచ్చు. ఒకవేళ అవతలి వ్యక్తులు మీ నెంబర్‌కు కాల్ చేసినా ఇన్ వ్యాలిడ్ అని వస్తుంది. ఈ ట్రిక్ ఎలా చేస్తారో.. దాని కథాకమామీషు ఏమితో తెలుసుకుందాం.. మొదటిగా స్మార్ట్‌ ఫోన్‌లో ప్లేస్టోర్‌ నుంచిటెక్స్ట్‌ మీ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఐతే ఫోన్‌లో ఒకే సిమ్‌ మాత్రమే ఉండాలి. యాప్‌ డౌన్‌లోడ్ చేసిన తర్వాత సైన్ ఇన్ కోసం వివరాలను నమోదు చేసుకోవాలి. తర్వాత ఎవరికైతే మీ నెంబర్‌ కనిపించకూడదని అనుకుంటారో వారి నెంబర్‌ను ఎంటర్‌ చేయాలి. ఐతే అందుకు కొంత ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. అవును.. ఈ యాప్‌ సర్వీసులు ఉచితం కాదు. అందుకు కొంత రుసుము చెల్లించడం ద్వారా ఈ యాప్‌ సేవలు వినియోగించవచ్చు.

అలాగే కొన్ని సందర్భాల్లో ఉచితంగా కూడా ఈ యాప్‌ను వినియోగించవచ్చు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసినందుకు మీకు కొన్ని క్రెడిట్‌ పాయింట్‌లు వస్తాయి. ఈ క్రెడిట్‌ పాయింట్ల సహాయంతో మీరు ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు. అప్పుడు మీ నెంబర్‌ వాళ్ల ఫోన్‌లో కనిపించదు. ఐతే ఇది లిమిట్‌గా మాత్రమే ఉంటుంది. ఈ యాప్‌ నుంచి కాల్‌ బ్యాక్‌ చేయడానికి కింద డయలర్ ప్యాడ్ ఉంటుంది. దానిపై ఏదైనా నెంబర్‌కి కాల్‌ చేస్తే మీ కాల్ అవతలి వ్యక్తికి వెళ్లినప్పుడు అందులో నెంబర్‌ కనిపించదు. అలాగే మీ నెంబర్‌ విజిబుల్‌ కాకుండానే ఎవరికైనా మెసేజ్‌లను కూడా పంపవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ కథనాల కోసం క్లిక్‌ చేయండి.