Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఏఐ ఫీచర్‌.. ఇంతకీ దీని ఉపయోగం ఏంటంటే..

ఈ నేపథ్యంలో తాజాగా మెటా యాజమాన్యానికి చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ఈ దిశగా ఇన్‌స్టాగ్రామ్‌ ఇప్పటికే అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను సంపాదించుకున్న ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లను మరింత ఆకర్షించే దిశగా...

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఏఐ ఫీచర్‌.. ఇంతకీ దీని ఉపయోగం ఏంటంటే..
Instagram
Follow us

|

Updated on: Feb 10, 2024 | 5:03 PM

ప్రస్తుతం ప్రపంచమంతా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గురించి చర్చించుకుంటున్నారు. దాదాపు అన్ని రంగాల్లో కృత్రిమ మేథ వినియోగం అనివార్యంగా మారింది. తమ సేవలను మరింత విస్తృతి పరిచేందుకు పలు సంస్థలు ఇప్పటికే ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ సైట్స్‌ అమెజాన్‌ ఏఐ సేవలను వినియోగించుకుంటున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తాజాగా మెటా యాజమాన్యానికి చెందిన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ఈ దిశగా ఇన్‌స్టాగ్రామ్‌ ఇప్పటికే అడుగులు వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లను సంపాదించుకున్న ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లను మరింత ఆకర్షించే దిశగా ఏఐ టెక్నాలజీతో కూడిన ఫీచర్‌ను పరిచయం చేయనుంది.

అలెశాండ్రో పలబ్జీ అనే రీసెర్చర్‌ తన ఎక్స్‌ అకౌంట్‌లో ఈ కొత్త ఫీచర్‌కు సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను షేర్ చేశారు. ఇంతకీ ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేయనున్న ఈ కొత్త ఫీచర్‌ ఉపయోగం ఏంటంటే. యూజర్లు మెసేజ్‌లు పంపించే సమయంలో ఏఐని ఉపయోగించుకునే అవకాశం లభిస్తుంది. అలెశాండ్రో పలబ్జీ ఈ కొత్త ఫీచర్‌ గురించి ట్వీట్ చేస్తూ.. ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు మెసేజ్‌లను పంపించే ఫీచర్‌పై ఇన్‌స్టాగ్రామ్‌, ఏఐతో కలిసి పనిచేస్తోందని తెలిపారు.

ప్రముఖ సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌కు చెందిన మ్యాజిక్‌ కంపోజ్‌ ఫీచర్‌ మాదిరిగానే ఈ ఇన్‌స్టాగ్రామ్ కొత్త ఫీచర్‌ పనిచేస్తుందని అలెశాండ్రా అభిప్రాయపడుతున్నారు. దీంతో మెసేజింగ్ మరింత సులభతరం అవుతుందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక మెటాకు చెందిన థ్రెడ్‌ యాప్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ మాదిరిగా సేవ్‌ పోస్ట్‌ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో యూజర్లు తమనకు ఇష్టమైన పోస్టులను బుక్‌మార్క్‌ చేసుకునే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం టెస్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అన్ని రంగాల్లో క్రమంగా విస్తరిస్తోంది. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల గ్యాలక్సీ ఏఐ ఫీచర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అలాగే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల తమ కంపెనీ భారత్‌లో 20 లక్షల మందికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ ఇవ్వనుందని తెలిపారు. దీనిబట్టే భవిష్యత్తుల్లో ఏఐ ఎంతటి కీలక పాత్ర పోషించనుందో అర్థం చేసుకోవచ్చు. ఇక మెటా కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకునే పనిలో పడింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లను AI ఫీచర్లతో సన్నద్ధం చేయడానికి చాలా కాలంగా కృషి చేస్తున్నారు. ఇక ఏఐ టెక్నాలజీ రాకతో ఓవైపు ఉద్యోగాలు పోతాయనే వాదన వినిపిస్తున్నా, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
ముగ్గురు యువకులను తొక్కుతుంటూ వెళ్లిన కారు.. భయానక దృశ్యాలు వైరల్
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
అదృష్టమంటే ఇదే.. గోడకు వేలాడదీసిన పెయింటింగ్‌ విలువ రూ.55 కోట్లు
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
ఫ్లైట్‌లో టిప్‌టాప్‌గా వచ్చిన మహిళ.. అనుమానంతో బ్యాగ్‌ తెరువగా !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
పక్షుల రాకుండా వల ఏర్పాటు చేస్తే.. అందులో ఏం చిక్కిందో చూడండి !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళకు ఊహించని షాక్‌ !!
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
హైదరాబాద్‌ పరిధిలో డీజేలపై నిషేధం.. గీత దాటితే.. తప్పదు జైలుశిక్ష
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
ఆహారం అందిస్తుండగా సింహం దాడి.. చివరకు ??
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో.. రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా !!
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
అది ఓడనా ?? లేక ఆర్టీసీ బస్సా ?? అతనేం చేసాడో చూస్తే నవ్వాగదు
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక
క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్‌ ఆర్డర్‌.. డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక