Instagram: యువతను ఎక్కువగా ఆకర్షించిన సోషల్ మీడియా సైట్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫేస్‌బుక్ (Facebook) సోషల్ మీడియాను ఏలుతోన్న సమయంలో వచ్చిన ఇన్‌స్టాగ్రామ్ ఎంతో మంది యూజర్లను తనవైపు తిప్పుకుంది. ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూ వస్తోన్న ఇన్‌స్టాగ్రామ్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లకు కలిగే ప్రయోజనాలు ఏంటంటే.
ఈ కొత్త ఫీచర్‌ను ఇన్‌స్టా ఐజీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అధికారికంగా ప్రకటించారు. ఈ ఫీచర్ సహాయంతో యూజర్లు తమ సమీపంలో ఉన్న స్థానిక వ్యాపారాలు, ప్రముఖ స్థలాలను కనుగొనవచ్చు. దీంతో యూజర్లు ఏదైనా కొత్త ప్రదేశాన్ని సందర్శించిన సమయంలో సదరు లొకేషన్‌కు సంబంధించిన వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు. దుకాణాలు, రెస్టారెంట్‌లు, బార్‌లు, పార్క్‌లు, సందర్శనీయ ప్రాంతాలు ఇలా అన్నింటి వివరాలను తెలుసుకోవచ్చు. గత ఏడాది నుంచి ఈ ఫీచర్‌పై టెస్టింగ్ జరుగుతుండగా, త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..