Infinix Smart 5A: ఇన్‌ఫినిక్స్ నుంచి మరో మొబైల్.. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో నేడు విడుదల.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..!

|

Aug 02, 2021 | 10:50 AM

ఇన్‌ఫినిక్స్ సంస్థ తన నూతన మొబైల్‌ను ఇండియాలో నేడు (ఆగస్టు 2న) విడుదల చేయనుంది. ఈమేరకు ఫ్టిప్‌కార్ట్ టీజర్ పేజీతో పాటు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇందులో మొబైల్‌కు సంబంధించిన డిజైన్‌తోపాటు స్పెసిఫికేషన్లు కూడా చూపించారు.

Infinix Smart 5A: ఇన్‌ఫినిక్స్ నుంచి మరో మొబైల్.. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో నేడు విడుదల.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..!
Infinix Smart 5a
Follow us on

Infinix Smart 5A: ఇన్‌ఫినిక్స్ సంస్థ తన నూతన మొబైల్‌ను ఇండియాలో నేడు (ఆగస్టు 2న) విడుదల చేయనుంది. ఈమేరకు ఫ్టిప్‌కార్ట్ టీజర్ పేజీతో పాటు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇందులో మొబైల్‌కు సంబంధించిన డిజైన్‌తోపాటు స్పెసిఫికేషన్లు కూడా చూపించారు. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5 ఏ (Infinix Smart 5A) పేరుతో విడుదల కానున్న ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇప్పటికే ఆన్‌లైన్‌లో లీకయిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో భారతదేశంలో విడుదలైన ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 ఫొన్‌కు తదుపరి మోడల్‌గా రానుందని తెలుస్తోంది. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5 ఏ బ్యాటరీ, బరువు, సెక్యూరిటీ లాక్ ఫీచర్‌లు ఫ్లిప్‌కార్ట్ పేజీలో అందించారు.

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5 ఏ లాంచ్..
ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5 ఏ స్మార్ట్‌ఫోన్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల కానుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలను ప్రత్యక్ష ప్రసారం చేసే విషయం మాత్ర ప్రకటించలేదు.

ఫ్లిప్‌కార్ట్ లిస్టింగ్ మేరకు ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5 ఏ ఫోన్.. 6.52 అంగుళాల డిస్‌ప్లేతో రానుంది. అలాగే ఈ ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాల సెటప్ అందించనున్నారు. ఫింగర్ ప్రింట్ స్కానర్, పేస్ అన్‌లాక్ లాంటి ఫీచర్లతో పాటు 5000ఎంఏహెచ్ బ్యాటరీతో విడుదల కానుంది. ఈ ఫోన్ ఓషన్ వేవ్, మిడ్‌నైట్ బ్లాక్, క్వెట్టల్ సయాన్ కలర్ ఆఫ్షన్లలో అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది.

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5ఏ ధర..
ఇప్పటికే విడుదలైన లీకుల మేరకు ఈ ఫోన్ రూ. 5,000 నుంచి రూ.10,000 ల మధ్యన ఉండొచ్చని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు జియో నుంచి రూ.550 క్యాష్ బ్యాక్ లభించనుంది. అలాగే నోకాస్ట్ ఈఎంఐతో పాటు ఎక్స్చెంజ్ ఆఫర్‌లోనూ ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5ఏ సొంతం చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.

ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ 5ఏ కంటే ముందు ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 5 స్మార్ట్‌ఫోన్‌ను గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ .7,199గా ఉంది. మీడియా టెక్ హీలియో జీ25 ప్రాసెసర్‌తోపాటు 6000ఎంఏహెచ్ జంబో బ్యాటరీతో విడుదలైంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 53 గంటలపాటు బ్యాకప్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

Also Read: మొబైల్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక.. అలా చేయకపోతే ఇబ్బందులు తప్పవంటూ..

Wet Phone: వర్షంలో ఫోన్ తడిచిపోయిందా.. ఇలా చేయడం ద్వారా అది పాడవకుండా చూడొచ్చు.. ప్రయత్నించండి!