5జి నెట్‌వర్క్‌లో ఏముంది… భారత్‌లో ఎందుకంత ఆలస్యం…?

5జి ఫీవర్‌ మొదలైంది. 5జి మొబైల్స్‌ మార్కెట్లోకి వస్తుండటంతో త్వరలోనే 5జి నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానుందని అంచనా వేస్తున్నారు. ఇంతకీ 5జిలో ఏముంది? దీంతో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారునికి కొత్తగా కలిగే ప్రయోజనం ఏంటి? గత రెండేళ్లుగా ఎక్కడ చూసినా 5జి మాట వినిపిస్తోంది. 5జి సపోర్ట్‌ చేసే సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 10 వంటి మొబైల్స్‌ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. 5జి అంటే కేవలం వేగం మాత్రమే కాదు, కనెక్షన్‌ సాంద్రత పెరగటం, లేటెన్సీ తగ్గడం వంటివి […]

5జి నెట్‌వర్క్‌లో ఏముంది... భారత్‌లో ఎందుకంత ఆలస్యం...?
Follow us

| Edited By:

Updated on: Sep 23, 2019 | 3:37 PM

5జి ఫీవర్‌ మొదలైంది. 5జి మొబైల్స్‌ మార్కెట్లోకి వస్తుండటంతో త్వరలోనే 5జి నెట్‌వర్క్‌ అందుబాటులోకి రానుందని అంచనా వేస్తున్నారు. ఇంతకీ 5జిలో ఏముంది? దీంతో స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారునికి కొత్తగా కలిగే ప్రయోజనం ఏంటి? గత రెండేళ్లుగా ఎక్కడ చూసినా 5జి మాట వినిపిస్తోంది. 5జి సపోర్ట్‌ చేసే సామ్‌సంగ్‌ గెలాక్సీ నోట్‌ 10 వంటి మొబైల్స్‌ ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. 5జి అంటే కేవలం వేగం మాత్రమే కాదు, కనెక్షన్‌ సాంద్రత పెరగటం, లేటెన్సీ తగ్గడం వంటివి కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 5జిని శక్తివంతంగా చేయడం కోసం నోకియా, క్వాల్ కామ్‌, ఎరిక్సస్‌, సాంసంగ్‌, ఇంటెల్‌ వంటి కంపెనీలు పరిశోధనల మీద పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాయి. వాటి ఫలితాలు ఇప్పుడు ఆస్వాదించబోతున్నాం.

5జి ద్వారా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ని సుదూర ప్రాంతాలకు తక్కువ లేటెన్సీతో కల్పించాలంటే సిగ్నల్స్‌ ప్రసారం చేయబడే విధానం మొత్తం కొత్తగా ఉండాలి. దీన్ని సాధించడం కోసం సాంకేతికంగా అనేక మార్పులు 5జిలో చోటుచేసుకున్నాయి. భారత్‌లో 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన పరికరాలు, మౌలిక వనరులు, స్పెక్ట్రం వంటి కనీస వనరులు ఏవీ ఇప్పటివరకు అందుబాటులో లేవు. భారతదేశంలో 5జీ అందుబాటులోకి రావడానికి 2023 వరకు, సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావడానికి 2025 వరకు సమయం పడుతుందని ఒక అంచనా.

ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూస్తే 3జీ, 4జీ నెట్‌వర్క్‌ ల హవా మరో 5-6 సంవత్సరాలు నడిచే అవకాశం ఉందని అంటున్నారు. భారత్‌లో 2020 కల్లా 5జీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నా… ఇంకా 5జీ స్పెక్ట్రంకి సంబంధించిన ప్రయోగాలే ప్రారంభం కాలేదు. నోకియా, హువావే సంస్థలు భారతదేశంలో ఆయా సంస్థల పరంగా 5జీ ప్రయోగాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాయి. అంతర్జాతీయ డేటా కార్పొరేషన్(ఐడీసీ) నివేదిక ప్రకారం 2019లోనే 5జీ కొన్ని దేశాల్లో ప్రారంభం అయింది. 2020 నాటికి మరిన్ని దేశాల్లో అందుబాటులోకి రానుంది. 2020లో ప్రపంచ వ్యాప్తంగా అమ్ముడుపోయే స్మార్ట్ ఫోన్లలో 8.9 శాతం స్మార్ట్ ఫోన్లు 5జీవే ఉంటాయని, ఐడీసీ అంచనా వేసింది. ఇది 2023 నాటికి 28.1 శాతానికి వెళ్తుందని జోస్యం చెప్పింది. 5జీ నెట్ వర్క్ మొబైల్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులను తీసుకురానుంది.

ప్రస్తుతానికి 5జీని అందరికీ అందుబాటులోకి తీసుకెళ్లడంలో దక్షిణ కొరియా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా ముందున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఇంటర్నెట్ ఆధారిత కమ్యూనికేషన్లు, వీడియో స్ట్రీమింగ్ చేసే సంస్థల్లో 66 శాతానికి పైగా సంస్థలు 2020 నాటికి 5జీకి తగ్గట్లు సిద్ధమయినా, టెలికాం సంస్థలు ఆ వేగాన్ని అందుకోవడంలో వెనకపడి ఉన్నట్లు కనిపిస్తున్నాయి. రానున్న కాలంలో కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్లు 5జీకి సిద్ధం కాకపోతే, దాని ప్రభావం వినియోగదారుల మీద పడనుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సంస్థలు, వినియోగదారులకు అవసరమైన లేదా వారి స్థాయికి తగ్గ సర్వీసులను అందించడంలో 5జీ సర్వీస్ ప్రొవైడర్లు అందించే సేవలు ఇంకా చాలా వెనకబడే ఉన్నాయి. మన దేశంలో ప్రస్తుతం 60 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. కాబట్టి 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తే వారికి ఉండే అతి పెద్ద మార్కెట్లో భారత దేశం కచ్చితంగా ముందువరుసలోనే ఉంటుంది. కాబట్టి ఈ విషయమై సర్వీస్ ప్రొవైడర్లు, ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుని నిరంతరాయ 5జీ సేవలను త్వరలో మార్కెట్లోకి తీసుకువస్తారని ఆశిద్దాం.