మానవత్వం అంటే ఇదికదా! దిక్కు తోచని స్థితిలో అనాథ శవం.. టూవీలర్‌పై తరలించి అంతిమ సంస్కారాలు..

మానవత్వం మంటగలుస్తోంది. సాటి మనిషికి సాయం చేద్దామన్నా ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఆపదలో ఉన్న వాడికి ఆపన్న హస్తం మాట దేవుడెరుగు.. ప్రాణం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో అనాథగా శవం పడి ఉన్నా.. కనికరించేవాడే. దీంతో.. ఆ ఇద్దరూ తోడై.. ఆ మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఎవరు దరి చేరకున్నా.. మేం ఉన్నామంటూ ముందుకు వచ్చారు. ఈ హృదయవిదారకర ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

మానవత్వం అంటే ఇదికదా! దిక్కు తోచని స్థితిలో అనాథ శవం.. టూవీలర్‌పై తరలించి అంతిమ సంస్కారాలు..
Last Rites Of The Orphan
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: May 07, 2024 | 2:48 PM

మానవత్వం మంటగలుస్తోంది. సాటి మనిషికి సాయం చేద్దామన్నా ఎవరూ ముందుకు రాని పరిస్థితి. ఆపదలో ఉన్న వాడికి ఆపన్న హస్తం మాట దేవుడెరుగు.. ప్రాణం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో అనాథగా శవం పడి ఉన్నా.. కనికరించేవాడే. దీంతో.. ఆ ఇద్దరూ తోడై.. ఆ మృతదేహానికి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. ఎవరు దరి చేరకున్నా.. మేం ఉన్నామంటూ ముందుకు వచ్చారు. ఈ హృదయవిదారకర ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

విశాఖ మహానగరం పరిధిలోని కొత్త గాజువాక ప్రాంతం.. హిమాచల్‌నగర్‌కు వెళ్లే రహదారి అది. రోడ్డు పక్కనే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయి, విగత జీవిగా పడి ఉన్నాడు. వయసు దాదాపుగా 50 కి పైనే ఉంటుంది. గత కొంతకాలంగా అదే ప్రాంతంలో ఉంటూ యాచిస్తూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ఉన్నట్టుండీ ప్రాణాలు కోల్పోయాడు. ఇది గమనించిన స్థానికులు గాజువాక పోలీసులకు సమాచారం అందించారు. హెడ్ కానిస్టేబుల్ బి నారాయణ అక్కడకు వెళ్లి ఆరా తీశారు. మృతదేహాన్ని తరలించేందుకు సిద్ధమయ్యారు.

ప్రైవేట్ అంబులెన్స్, తోపుడు రిక్షా, సాయం కోసం ఎదురుచూశారు. కానీ ఎవరో ముందుకు రాలేదు. గంటలకొద్దీ వేచి చూసినా.. ఎవరు కనికరించలేదు. చలించలేదు. దీంతో సాయంత్రం వరకు వేచి చూసిన హెడ్ కానిస్టేబుల్, సామాజిక కార్యకర్త తరుణ్ కు సమాచారం ఇచ్చారు. అతని సహకారంతో స్వయంగా 2 వీలర్‌పై మృతదేహన్ని తరలించారు. హెడ్ కానిస్టేబుల్ నారాయణ బైక్ డ్రైవ్ చేస్తుండగా, వెనకాల మృతదేహాన్ని తరుణ్ పట్టుకుని కూర్చున్నాడు. అక్కడి నుంచి అతి కష్టం మీద ఆ మృతదేహాన్ని జోగవానిపాలెం స్మశాన వాటికకు తరలించారు. అక్కడ ఖననం చేసి మానవత్వం చాటుకున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..