Smartphones Under 20000: ఈ ఫోన్స్‌తో ఫొటో తీస్తే అమేజింగ్ క్వాలిటీ.. సెల్ఫీ లవర్స్‌కు పండగే..

|

Mar 09, 2023 | 7:30 PM

ఎందుకంటే మధురమైన క్షణాలను ఎప్పుడూ చేతిలో ఉండే ఫోన్‌తో క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడు అలవాటుగా మారింది. మరికొంతమందైతే కేవలం ఫొటోలను దిగడానికే ఫోన్స్ వాడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Smartphones Under 20000: ఈ ఫోన్స్‌తో ఫొటో తీస్తే అమేజింగ్ క్వాలిటీ.. సెల్ఫీ లవర్స్‌కు పండగే..
Follow us on

మొదట్లో కేవలం సమాచార మార్పిడికి వాడిన ఫోన్లు.. క్రమేపి అధునాత ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టకుంటున్నాయి. ప్రస్తుతం యువత ఫోన్స్ అంటే ప్రాసెసర్‌తో పాటు కెమెరా విషయాన్ని కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మధురమైన క్షణాలను ఎప్పుడూ చేతిలో ఉండే ఫోన్‌తో క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడు అలవాటుగా మారింది. మరికొంతమందైతే కేవలం ఫొటోలను దిగడానికే ఫోన్స్ వాడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు కొన్ని సూపర్ కెమెరాతో వినియోగదారులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. మల్టీ లెన్స్ కెమెరా సెటప్, పోర్ట్రెయిట్ మోడ్, 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ కెమెరా ఫీచర్‌లతో ఫోన్లు వస్తున్నాయి. అందువల్ల ప్రస్తుతం రూ.20000 లోపు సూపర్ కెమెరా ఫీచర్లతో అందుబాటులో ఉన్న ఫోన్లపై ఓ లుక్కేద్దాం.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్

వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో 64ఎంపీ ప్రైమరీ షూటర్, రెండు 2ఎంపీ సెకండరీ సెన్సార్‌లను కలిగి ఉంటుంది. ప్రైమరీ షూటర్ వల్ల ఫొటో తీస్తే ఇమేజ్ క్వాలిటీ బాగుంటుంది. అలాగే ఇది అధునాతన షూటింగ్ మోడ్‌లను అందిస్తుంది. 8 జీబీ + 64 జీబీ వేరియంట్‌లో వచ్చే ఈ ఫోన్ ధర రూ.18,999గా ుంది.

రియల్ మీ 10 ప్రో

రియల్ మీ 10 ప్రో 5 జీ 108 ఎంపీ కెమెరాతో వస్తుంది.  తక్కువ ధరలో భారీ కెమెరా సెన్సార్‌తో వచ్చే ఏకైక ఫోన్ ఇదే 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా కూడా సెల్ఫీ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. 6.72-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో, స్నాప్ డ్రాగన్ 695 సూపర్ ప్రాసెసర్ హై స్పీడ్‌తో ఫోన్ పని చేస్తుంది. అలాగే అద్భుతమైన చార్జింగ్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. దీని ధర కూడా రూ.18999గా ఉంది.

ఇవి కూడా చదవండి

సామ్‌సంగ్ గెలాక్సీ ఎం33 5 జీ

సామ్‌సంగ్ గెలాక్సీ ఎం33 5 జీ క్వాడ్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది,  50 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 5 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా, 2 ఎంపీ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌ కెమెరాలో పోర్ట్రెయిట్, నైట్ మోడ్, ఇతర అధునాతన షూటింగ్ మోడ్స్‌తో ఆకట్టకుంటుంది. ముఖ్యంగా షూటింగ్ మోడ్ యూట్యూబర్స్‌కు అనువుగా ఉంటుంది. ఎక్సినోస్ 1280 చిప్‌సెట్,  6జీబీ ర్యామ్‌తో, 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో వచ్చే డిస్‌ప్లే ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ మొబైల్ ధర రూ.15,999గా ఉంది.

అప్పో ఏ 78

అప్పో ఏ 78 5జీ ఫోన్ 50 ఎంపీ కెమెరా సెటప్‌తో వస్తుంది. 2 ఎంపీ డ్యుయల్ కెమెరాతో పాటు పొర్ట్రెయిట్ మోడ్‌కు సహకరిస్తుంది. 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ సెల్ఫీ లవర్స్‌ను ఆకట్టుకుంటుంది. నైట్ మోడ్, పనోరమిక్ వంటి అనే షూట్ మోడ్స్‌తో వస్తుంది. మీడియా టెక్ చిప్ సెట్‌తో 8 జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.19,300గా ఉంది.

రెడ్ మీ నోట్ 11 ప్రో

రెడ్‌మి నోట్ 11 ప్రో 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ను అందించే అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్‌లలో ఇది ఒకటి. హ్యాండ్‌సెట్ మీడియా టెక్ హీలియో జీ 96 చిప్‌సెట్‌తో సూపర్ ఫాస్ట్‌గా ఈ ఫోన్ పని చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో మద్దతుతో వచ్చే ఈ ఫోన్ ధర రూ.17,999గా ఉంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి