WhatsApp accounts: వాట్సప్‌లో రెండో అకౌంట్ యాాడ్ అవ్వడం లేదా..? ఇలా చేస్తే మీ ప్రాబ్లం క్లియర్

ఒక వాట్సప్‌లో రెండు అకౌంట్లు వాడుకునే అవకాశం ఉంది. కానీ ఒక్కొక్కసారి రెండో నెంబర్ యాడ్ అవ్వక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలా జరగడానికి కొన్ని సాంకేతిక సమస్యలు కారణం అయి ఉండొచ్చు. అప్పుడు ఏం చేయాలి..? అనేది ఇందులో చూద్దాం.

WhatsApp accounts: వాట్సప్‌లో రెండో అకౌంట్ యాాడ్ అవ్వడం లేదా..? ఇలా చేస్తే మీ ప్రాబ్లం క్లియర్
Whats App

Updated on: Nov 26, 2025 | 4:13 PM

WhatsApp: స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతీఒక్కరి ఫోన్లలో వాట్సప్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. టెక్నాలజీ యుగంలో ఆఫీస్ లేదా వ్యాపార పనుల కోసం వాట్సప్ వాడటం అనేది అలవాటుగా మారింది. కొంతమంది ఎలాంటి డిస్టబెన్స్ లేకుండా ఉండేందుకు వ్యక్తిగత పనుల కోసం ఒక వాట్సప్ నెంబర్.. ఆఫీస్ లేదా వ్యాపార పనుల కోసం కోసం వేరే నెంబర్ వాడుతూ ఉంటారు. ఇలా రెండు వాట్సప్ అకౌంట్లను వాడటం అనేది సాధారణంగా మారిపోయింది. ఇంతకముందు రెండు వాట్సప్ అకౌంట్లను వాడాలంటే వేరే వేరు ఫోన్లు ఉండాల్సిన అవసరం వచ్చేది. కానీ ఇప్పుడు ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్లు వాడే వెసులుబాటు లభించింది. ఐఫోన్లలో కూడా ఇలాంటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.

ఎలా సెట్ చేసుకోవాలి..?

-వాట్సప్ ఓపెన్ చేసి మెనూ ఐకాన్‌పై క్లిక్ చేయండి

-ఆ తర్వాత సెట్టింగ్స్‌లోకి వెళ్లి మీ పేరు పక్కన కనిపించే ఐకాన్‌పై క్లిక్ చేయండి

-యాడ్ అకౌంట్‌పై క్లిక్ చేయండి వాట్సప్ నియమ, నిబంధనలను ధృవీకరించండి.

-అక్కడ దేశం సెలక్ట్ చేసుకుని మీ సెకండ్ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి

-కంటిన్యూపై క్లిక్ చేశాక మీ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయండి

-ఆ తర్వాత మీ పేరు నమోదు చేసి నెక్ట్స్‌పై ట్యాప్ చేయండి

-మీ ప్రొఫైల్ ఫొటో అప్‌లోడ్ చేయండి

 

ఎలా స్విచ్ అవ్వాలి..?

-వాట్సప్‌లోకి వెళ్లి మెనూపై క్లిక్ చేయాలి

-స్విచ్ అకౌంట్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి

-ఏ అకౌంట్ యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్‌ను సెలక్ట్ చేసుకోండి

 

నోటిఫికేషన్లు, కాల్స్

-మీరు అకౌంట్‌లో ఉన్నప్పుడు వేరే అకౌంట్‌కు కాల్స్ లేదా మెస్సేజ్‌లు వస్తే మీకు ఫుష్ నోటిఫికేషన్ వస్తుంది

-మీరు యాక్సెప్ట్ చేయాలనుకుంటే ఫుష్ నోటిఫికేషన్‌పై క్లిక్ చేసి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడవచ్చు.

-ఒకవేళ వద్దనుకుంటే ఆ అకౌంట్లోకి వెళ్లకుండానే కాల్ డిస్మిస్ చేయవచ్చు

 

సాంకేతిక సమస్యలు వస్తే..?

-ఫోన్ రీస్టార్ట్ చేయండి

-వైఫై, మొబైల్ డేటాను సమస్యలను చెక్ చేయండి

-మీ ఫోన్‌లో వాట్సప్ లేటెస్ట్ వెర్షన్ ఉందా… లేదా అనేది చూడండి

-మీ సెకండ్ నెంబర్ ఓటీపీ మెస్సేజ్‌లను అందుకోవడానికి యాక్టివ్‌లో ఉందా అనేది చూడండి

-మీరు రెండో అకౌంట్ ఎక్కువరోజులు వాడకపోతే వాట్సప్ రీవెరిఫికేషన్ కోరే అవకాశముంది.