Whatsapp Chats Leak: వాట్సాప్ చాట్స్ లీక్ గురించి ఇటీవల తరచూ వినిపిస్తోంది. సెలబ్రిటీల నుంచి బడా వ్యాపారవేత్తల దాకా ఏదో ఓ సంఘటనలో వారి వాట్సాప్ చాట్ లీకైందన్న వార్తలు వస్తున్నాయి. ఇలా వాట్సాప్ ప్రైవసీపై అనుమానం వచ్చిన ప్రతిసారీ.. వాట్సాప్ చెప్పే సమాధానం ఒక్కటే. మీరు ఇతరులకు పెట్టే మెసేజ్‌లు, కాల్స్, వీడియోలు అన్నీ ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రత ఉంటుందని వాట్సప్ ఇస్తున్న స్టేట్‌మెంట్ ఇది. కానీ వాట్సాప్ చాట్స్ లీక్ వ్యవహారంపై వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి ఇంతకీ వాట్సాప్ చాట్ లీక్ ఎలా అవుతుంది.? అసలు దాని వెనుక ఉన్న కథేంటి? ఇప్పుడు తెలుసుకుందాం..
వాట్సాప్ నుంచి మనం షేర్ చేసిన సమాచారం మన ఫోన్లోగానీ లేక క్లౌడ్ డ్రైవ్‌లోగానీ స్టోర్ అవుతుంది. మనం ఏదైనా నేరం చేసి పోలీసులకు చిక్కినప్పుడు వారికి మీపై అనుమానం ఉంటే.. మన వాట్సాప్ నుంచి సమాచారం తీసుకునే అధికారం వారికి ఉంటుంది. అలాంటి సమయంలో ఎప్పుడైనా మీ ఫోన్ పోయినప్పుడు, ఎవరైనా దొంగలించినప్పుడు.. మీ వాట్సాప్‌కు సెక్యూరిటీ కోడ్ లేకపోతే, మీ ఫోన్ దొరికినవారికి మీ వాట్సాప్ సమాచారం లభించినట్లే అవుతుంది.
అలాగే మీరు ఎప్పుడైనా తెలియని వారితో చాట్ చేసినా వాళ్లు క్రైమ్ కేసుల్లో ఉన్నట్లు అయితే.. పోలీసులు మీ మీద కూడా ఓ నిఘా ఉంచేందుకు అవకాశం కూడా ఉంది. అలాగే మీ సమాచారాన్ని వారు సేకరిస్తారు. అయితే మీ వాట్సాప్‌ను ఎప్పుడూ సెక్యూరిటీ కోడ్‌తో లాక్ చేసి ఉంచండం మంచిదని చెబుతున్నారు సైబర్ నిఫుణులు. అలాగే వాట్సాప్ కాల్స్‌లో డ్రగ్స్, పోర్న్, వేధింపులు.. వంటివి నేరానికి సంబంధించిన సంభాషణలు చేయకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు.
Also read:
Coca Cola: కొకకోలాకు రోనాల్డో ఝలక్ ఇస్తే.. వార్నర్ ఫన్ ఇచ్చాడు.. మ్యాటర్ ఏంటంటే..!