WhatsApp Data Transfer: వాట్సాప్ డేటా ట్రాన్స్‌ఫర్: ఆండ్రాయిడ్ ఫోన్ నుండి యాపిల్ డివైజ్‌కి వాట్సాప్ డేటాను బదిలీ చేయడం చాలా కష్టమైన పని. ఇంతకు ముందు వాట్సాప్ చాట్ బ్యాకప్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ నుండి యాపిల్ డివైస్‌కి బదిలీ చేయడం అసాధ్యం. అయితే ఇప్పుడు WhatsApp చాట్ హిస్టరీ, మీడియా ఫైల్‌లను బదిలీ చేయడానికి వినియోగదారులను WhatsApp అనుమతించింది. అయితే ఈ ఫీచర్ బీటా వెర్షన్ వాడుతున్న వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ అతి త్వరలో సాధారణ వినియోగదారుల కోసం విడుదల కానుంది. ఆండ్రాయిడ్ డివైజ్‌ల మధ్య వాట్సాప్ డేటాను యాపిల్ డివైజ్‌కి బదిలీ చేసే మార్గాలను ఇక్కడ తెలుసుకోండి.
WhatsApp డేటాను Android స్మార్ట్‌ఫోన్ నుంచి Apple ఫోన్‌కు బదిలీ చేయడానికి ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. iPhone OS తప్పనిసరిగా iOS 15.5 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. అదే సమయంలో Android పరికరం Android వెర్షన్ 5.0 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్ కలిగి ఉండాలి. WhatsApp డేటాను బదిలీ చేయడానికి ముందు WhatsAppని ముందుగా మీ Android ఫోన్‌లో అప్‌డేట్ చేసుకోండి. ఇది కాకుండా ఆండ్రాయిడ్, ఆపిల్ పరికరాలు ఛార్జింగ్‌లో నిమగ్నమై ఉండాలి. రెండు పరికరాలను తప్పనిసరిగా ఒకే Wi-Fi నెట్‌వర్క్‌లో కనెక్ట్ చేయాలి. వినియోగదారులు తమ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని ప్లే స్టోర్‌కి వెళ్లి ఆపిల్ ‘మూవ్ టు iOS’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
WhatsApp డేటాను బదిలీ చేయడానికి ఈ మార్గాలను అనుసరించండి
మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి