Power Saving Tips: ఈ 3 పనులు చేస్తే మీ ఏసీ కరెంట్ బిల్లు సగానికి సగం పడిపోతుంది.. అందరూ చేసే తప్పులివే..

వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో ఇళ్లల్లో ఏసీ వినియోగం అనేది పెరిగిపోతుంది. ప్రజలు ఎండ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఏసీలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కానీ కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఏసీ బిల్లును సగానికి సగం తగ్గించుకోవచ్చు. అదెలా అంటే..

Power Saving Tips: ఈ 3 పనులు చేస్తే మీ ఏసీ కరెంట్ బిల్లు సగానికి సగం పడిపోతుంది.. అందరూ చేసే తప్పులివే..
Air Conditioner Maintenance

Updated on: May 04, 2026 | 10:54 AM

దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండలు దంచికొడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు, ఉక్కబోతతో అవస్థలు పడుతున్నారు. వేసవి ఉష్ణోగ్రతల క్రమంలో ఇళ్లల్లో ఏసీల వినియోగం పెరిగిపోయింది. అయితే ఏసీలు కరెంట్‌ను ఎక్కువగా వినియోగిస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. దీంతో ఏసీ వేయాలంటేనే కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుందేమోనని అందరూ భయపడుతూ ఉంటారు. కరెంట్ బిల్లును తగ్గించుకునేందుకు ఏసీలు కొద్దిసేపు ఆన్ చేసి రూమ్ కూలింగ్ అయ్యాక ఆఫ్ చేస్తూ ఉంటారు. అయితే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు. ఎలాంటి టిప్స్ పాటించాలనేది ఇప్పుడు చూద్దాం.

కరెంట్ బిల్లు తగ్గించుకోవడం ఎలా..?

ఏసీని సరిగ్గా వాడటం వల్ల కరెంట్ బిల్లు తగ్గించుకోవచ్చు. టెంపరేచర్‌ను సరిగ్గా సెట్ చేయకపోవడం, ఫిల్లర్లు మురికిగా ఉండటంతో పాటు తలుపులు కిటికీలు తెరిచి ఉంచడం, సర్వీసింగ్ చేయించకపోవడం వంటి కారణాల వల్ల ఏసీ వృథా అవుతుంది. అయితే ఉష్ణోగ్రతలను స్టాండర్డ్‌గా ఉంచడం, రెగ్యూలర్‌గా క్లీన్ చేసుకోవడం వల్ల ఏసీ పనితీరు మెరుగుపడటంతో పాటు విద్యుత్ ఆదా అవుతుంది. ఏసీని 16 నుంచి 18 డిగ్రీల మధ్య సెట్ చేసుకోవడం వల్ల కరెంట్ ఎక్కువ ఖర్చవుతుంది. అదే టెంపరేచర్‌ను తగ్గిస్తే ఏసీపై భారం పెరుగుతుంది. దీని వల్ల విద్యుత్‌ను ఎక్కువగా వినియోగిస్తుంది. అదే 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచడం వల్ల కరెంట్ ఆదా అవుతుంది.

తలుపులు, కిటికీలు తెరిచి ఉంచకండి

ఇక ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు గది తలుపులు, కిటికీలు తెరిచి ఉంచకూడదు. కొంచెం తెరిచి ఉన్నా బయట నుంచి వేడి గాలి లోపలికి వస్తూ ఉంటుంది. దీని వల్ల రూమ్‌ను చల్లగా ఉంచడానికి ఏసీ నిరంతరం పని చేయాల్సి ఉంటుంది. దీని వల్ల కరెంట్ బిల్లు పెరుగుతుంది. అదే కిటికీలు, తలుపులు మూసి ఉంచడం వల్ల గది త్వరగా చల్లబడుతుంది. ఇక ఏసీ ఫిల్టర్లలో దుమ్ము పేరుకుపోవడం వల్ల గాలి ప్రవాహం అనేది తగ్గుతుంది. దీని వల్ల రూమ్ చల్లబడటానికి ఏసీ కష్టపడాల్సి వస్తుంది. దీని వల్ల కరెంట్ వినియోగం పెరుగుతుంది. అంతేకాకుండా ఫిల్టర్లను శుభ్రపర్చకపోతే ఏసీ పాడయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఏసీ ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించుకోవాలి. దీని వల్ల మెరుగ్గా పనిచేయడం వల్ల కరెంట్ వినియోగం తగ్గుతుంది. దీని వల్ల కూడా ఏసీ కరెంట్ బిల్లు తగ్గుతుందని చెప్పవచ్చు. చాలామంది సర్వీసింగ్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. దీని వల్ల నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us