Honor 100 Pro: మార్కెట్లోకి మరో ఇంట్రెస్టింగ్ ఫోన్.. 1.5 కే రిజల్యూషన్ డిస్‌ప్లేతో..
నెట్టింట వైరల్ అవుతోన్న ఈ లీక్ ఆధారంగా ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్3 ప్రాసెసర్‌ను అందించనున్నారు. నవంబర్ 23వ తేదీన హానర్ 100, హానర్ 100 ప్రో ఫోన్‌లను లాంచ్ చేయనున్నారు. తొలుత చైనా మార్కెట్లో ఈ ఫోన్‌లను తీసుకురానున్నారు. అనంతరం భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. దీనిపై త్వరలోనే...
ప్రస్తుతం డిస్‌ప్లేకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోన్న ఫోన్‌ల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రంమలోనే చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ తాజాగా టెక్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. హానర్ 100, హానర్ 100 ప్రో పేర్లతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. త్వరలోనే ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చైనీస్ టిప్‌స్టర్ ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లను లీక్ చేసింది.
నెట్టింట వైరల్ అవుతోన్న ఈ లీక్ ఆధారంగా ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం. ఈ ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్3 ప్రాసెసర్‌ను అందించనున్నారు. నవంబర్ 23వ తేదీన హానర్ 100, హానర్ 100 ప్రో ఫోన్‌లను లాంచ్ చేయనున్నారు. తొలుత చైనా మార్కెట్లో ఈ ఫోన్‌లను తీసుకురానున్నారు. అనంతరం భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు.
ఇక ఈ ఫోన్ స్క్రీన్‌కు ప్రత్యేకతంగా రూపొందించారు. 1.5 కే రిజల్యూషన్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. దీంతో యూజర్లు మెరుగైన డిస్‌ప్లే క్లారిటీని పొందొచ్చు. ఇక ఈ ఫోన్‌లో 2.63 జీహెచ్‌జెడ్ స్పీడ్‌తో కూడిన క్వాల్కమ్ క్రియో సీపీయూను అందించారు. ఛార్జింగ్ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 100 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని ఇవ్వనున్నారు. కెమెరాకు సైతం అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్న ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. ఇక సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు.
ఇక ఈ ఫోన్‌లో ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించనున్నట్లు సమాచారం. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. అలాగే 256 జీబీ స్టోరేజ్ కెపాసిటీతో ఈ ఫోన్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో రానున్న ఈ ఫోన్‌లో సెక్యూరిటీ కోసం ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇవ్వనున్నారు. సూపర్ ఛార్జింగ్ ఫీచర్‌తో రానున్న ఈ ఫోన్‌లో యూఎస్‌బీ టైప్‌సీ పోర్ట్‌ను అందించనున్నారు. ఆండ్రాయిడ్ వీ14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్‌ను ఇవ్వనున్నట్లు సమాచారం.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..