AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్కెట్‌పై దండయాత్రకు హోండా రెడీ.. ఎన్ని కొత్త మోడల్స్‌ తెస్తోందో తెలిస్తే షాకవుతారు

భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌పై పూర్తి దృష్టి సారించిన హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఏకంగా పది కొత్త మోడళ్లను ఒకేసారి పరిచయం చేసింది. పెట్రోల్, ఎలక్ట్రిక్, ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీతో కూడిన ఈ సరికొత్త లైనప్ గురించిన ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం!

మార్కెట్‌పై దండయాత్రకు హోండా రెడీ.. ఎన్ని కొత్త మోడల్స్‌ తెస్తోందో తెలిస్తే షాకవుతారు
Honda Motorcycle And Scooter India Unveils 10 New Two Wheelers
Nikhil
|

Updated on: Jul 28, 2026 | 7:10 AM

Share

భిన్న అవసరాలు ఉన్న కస్టమర్లను ఆకట్టుకునే లక్ష్యంతో అడ్వెంచర్ బైక్‌లు, ప్రీమియం మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్లను హోండా రంగంలోకి దింపింది. ఈ కొత్త మోడళ్ల ధరలు, ఫీచర్లు, మార్కెట్లోకి విడుదల చేసే సమయానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం!

పది కొత్త మోడళ్లు

భారతీయ టూ-వీలర్ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని మరింత చాటుకునేందుకు హోండా సంస్థ భారీ వ్యూహంతో ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా ఒకేసారి పది కొత్త ద్విచక్ర వాహనాలను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కొత్తగా పరిచయం చేసిన మోడళ్ల జాబితాలో XR300L, XR300 Rally, CB500, Rebel 300 e-Clutch, Rebel 500 e-Clutch, ADV160, QC3 ఎలక్ట్రిక్ స్కూటర్‌తో పాటు అప్‌డేటెడ్ CB350, CB350RS మరియు కొత్త రంగులతో రానున్న CB350C మోడల్స్ ఉన్నాయి. భిన్నమైన అభిరుచులు కలిగిన కస్టమర్లందరినీ దృష్టిలో ఉంచుకుని ఈ మోడళ్లను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.

ఈ-క్లచ్ టెక్నాలజీ

ఈ కొత్త లైనప్‌లో ‘ADV160’ స్కూటర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దేశంలో E85 ఫ్లెక్స్-ఫ్యూయల్‌కు అనుకూలంగా రూపొందించిన తొలి 160 సీసీ స్కూటర్‌గా ఇది గుర్తింపు పొందింది. ప్రత్యామ్నాయ ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు పర్యావరణహిత రవాణాకు ప్రాధాన్యం ఇస్తూ QC3 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా హోండా పరిచయం చేసింది. అలాగే మోటార్‌సైకిళ్ల విభాగంలో ‘Rebel 300 e-Clutch’ మరియు ‘Rebel 500 e-Clutch’ మోడళ్లు ప్రత్యేకంగా ఆకట్టుకోనున్నాయి. ఈ బైక్‌లలో క్లచ్ వినియోగాన్ని మరింత సులభతరం చేసే ఆధునిక ఈ-క్లచ్ సాంకేతికతను అందించడం ద్వారా సిటీ ట్రాఫిక్‌లో ప్రయాణం అత్యంత సౌకర్యవంతంగా మారనుంది.

ప్రీమియం సెగ్మెంట్‌పై పూర్తి దృష్టి

ఈ సరికొత్త మోడళ్ల ద్వారా ప్రీమియం బైక్స్ సెగ్మెంట్‌లో మరింత బలమైన స్థానాన్ని సంపాదించుకోవాలని హోండా భావిస్తోంది. అదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాలు, ఫ్లెక్స్-ఫ్యూయల్ టెక్నాలజీల్లో కూడా తన ప్రాధాన్యతను భారీగా పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అత్యాధునిక టూ-వీలర్లను తీసుకురానున్నట్లు కంపెనీ సంకేతాలు ఇచ్చింది. అయితే తాజాగా ప్రకటించిన పది మోడళ్లకు సంబంధించిన ధరలు, పూర్తి ఫీచర్లు, బుకింగ్ ప్రారంభ తేదీలు మరియు అధికారిక విడుదల సమయంపై హోండా ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదు. దశలవారీగా ఈ అన్ని వివరాలను వెల్లడించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Follow Us
హోండా ఎలక్ట్రిక్ లైనప్‌లో ప్రత్యేక ఆకర్షణగా 'QC3' స్కూటర్
హోండా ఎలక్ట్రిక్ లైనప్‌లో ప్రత్యేక ఆకర్షణగా 'QC3' స్కూటర్
అడ్వెంచర్ బైక్స్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల వరకు.. హోండా లైనప్‌
అడ్వెంచర్ బైక్స్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల వరకు.. హోండా లైనప్‌
టీమిండియాలో సంజూ శాంసన్ శకం ముగిసిందా.. రీఎంట్రీ కష్టమే..?
టీమిండియాలో సంజూ శాంసన్ శకం ముగిసిందా.. రీఎంట్రీ కష్టమే..?
షూస్ కొనేందుకు డబ్బుల్లేని స్థాయి నుంచి పతకాల శిఖరానికి.. ఎవరీమె
షూస్ కొనేందుకు డబ్బుల్లేని స్థాయి నుంచి పతకాల శిఖరానికి.. ఎవరీమె
కియా నుంచి సరికొత్త సైరోస్ ఎలక్ట్రిక్ SUV.. పూర్తి వివరాలు
కియా నుంచి సరికొత్త సైరోస్ ఎలక్ట్రిక్ SUV.. పూర్తి వివరాలు
పిల్లల లంచ్ బాక్స్‌లోకి సూపర్ రిసిపీ.. ఎలా చేయాలంటే?
పిల్లల లంచ్ బాక్స్‌లోకి సూపర్ రిసిపీ.. ఎలా చేయాలంటే?
కొద్దీ రోజులు ఈ రాశుల వారిదే హవా అసలు తగ్గేదే లే
కొద్దీ రోజులు ఈ రాశుల వారిదే హవా అసలు తగ్గేదే లే
మీరు బంగారం కొనడానికి వెళ్తున్నారా? తులం ధర ఎంత ఉందో తెలుసా..?
మీరు బంగారం కొనడానికి వెళ్తున్నారా? తులం ధర ఎంత ఉందో తెలుసా..?
ఆగస్టు నెలలో కొత్త ఇల్లు కొనుగోలు చేసే రాశులివే.. మీరున్నారా
ఆగస్టు నెలలో కొత్త ఇల్లు కొనుగోలు చేసే రాశులివే.. మీరున్నారా
కేతు గ్రహం ఎఫెక్ట్.. ఈ రాశుల జీవితంలో కొత్త మార్పులు
కేతు గ్రహం ఎఫెక్ట్.. ఈ రాశుల జీవితంలో కొత్త మార్పులు