
వాట్సప్‌లో మన చాట్‌లతో పాటు బ్యాంకింగ్ డీటైల్స్, ఫొటోలు లేదా వీడియోలు లాంటి వ్యక్తిగత వివరాలను భద్రపర్చుకుంటాం. వాట్సప్ ఎవరైనా హ్యాక్ చేసినా లేదా మీ ఫోన్ తీసుకుని ఎవరైనా చూసినా మీ విషయాన్నీ బయటపడే అవకాశముంది. అందుకే వాట్సప్‌ను ఎవరూ ఓపెన్ చేయకుండా సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం వాట్సప్ అనేక భద్రతా ఫీచర్లను తీసుకొచ్చింది. మీ వాట్సప్‌ను ఎవ్వరూ ఓపెన్ చేయకుండా టూ స్టెప్ ఐడెంటిఫికేషన్, ఆరు అంకెల పిన్ వంటి ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. వీటిని ఎలా సెట్ చేసుకోవాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
-వాట్సప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి
-అకౌంట్ అనే ఆప్షన్‌ను ఎంచుకుంది టూ స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేయండి
-ఆరు అంకెల పిన్‌ను ఎంటర్ చేయండి
-ఇమెయిల్ ఐడీని అందించండి
-మెయిల్ ఐడీకి వచ్చే పిన్ నెంబర్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
-వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లండి
-అకౌంట్ అనే ట్యాబ్‌పై క్లిక్ చేయండి
-టూ స్టెప్ వెరిఫికేషన్ అనే ఆప్షన్‌కు ఎంచుకుని డిసేబుల్ చేయండి
-వాట్సప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లండి
-అకౌంట్ అనే ఆప్షన్‌ను ఎంచుకుని టూ స్టెప్ వెరిఫికేషన్‌లోకి వెళ్లండి
-పిన్ మార్పు అనే ఆప్షన్‌కు ఎంచుకుని కొత్త ఆరు అంకెల పిన్ ఎంటర్ చేయండి