Weather Alerts: రాగల 24 గంటల్లో.. అంటూ ఫోన్లోకే వెదర్ అప్ డేట్స్.. ఇలా ఈజీగా పొందొచ్చు..

|

Jul 13, 2023 | 12:30 PM

మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఎప్పుడు వర్షం పడుతుంది? ఎక్కడ వరదలు వస్తున్నాయి? పిడుగులు పడే అవకాశం ఎక్కడుంది? వంటి వివరాలతో కూడిన హెచ్చరికలు మీకు వచ్చేస్తాయి. అందుకోసం మీరు చేయవలసినదల్లా వాతావరణ హెచ్చరికలను యాక్టివేట్ చేయడమే.

Weather Alerts: రాగల 24 గంటల్లో.. అంటూ ఫోన్లోకే వెదర్ అప్ డేట్స్.. ఇలా ఈజీగా పొందొచ్చు..
Weather Report
Follow us on

వర్షాలు రోజూ పడుతున్నాయి. ఏ సమయంలో వర్షం పడుతుందో.. ఎప్పుడు ఎండ ఉంటుందో తెలియడం లేదు. అకస్మాత్తుగా భారీ వర్షం, ఉరుములు, మెరుపులతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అప్పటి వరకూ ఎండగా ఉండటంతో మీరు గొడుగు, రెయిన్ కోట్ వంటివి తీసుకెళ్లి ఉండకపోవచ్చు. ఆ సమయంలో వర్షం మిమ్మిల్ని ఇరిటేషన్ కు గురిచేస్తుంది. అయితే ఇకపై ఆ ఇబ్బందులు ఉండవు. మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. ఎప్పుడు వర్షం పడుతుంది? ఎక్కడ వరదలు వస్తున్నాయి? పిడుగులు పడే అవకాశం ఎక్కడుంది? వంటి వివరాలతో కూడిన హెచ్చరికలు మీకు వచ్చేస్తాయి. అందుకోసం మీరు చేయవలసినదల్లా వాతావరణ హెచ్చరికలను యాక్టివేట్ చేయడమే. ఆండ్రాయిడ్ ఫోన్ అయినా, ఐఫోన్ అయినా మీరు ఈ హెచ్చరికలు పొందొచ్చు. అది ఎలా సెటప్ చేసుకోవాలి? నోటిఫికేషన్లు ఎలా వస్తాయి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఫోన్‌లో ఇలా..

యాపిల్ ఐఫోన్‌లో ఇన్ బిల్ట్ వెదర్ యాప్‌ ఉంటుంది. ఇది వరద హెచ్చరికలతో సహా ‘సివియర్ వెదర్ నోటిఫికేషన్‌లను’ అందిస్తుంది. ఈ ఫీచర్‌ని ఎనేబుల్ చేయడం ద్వారా యాప్ మీ పరిసరాల్లోని ప్రతికూల వాతావరణ పరిస్థితులకు సంబంధించిన నోటిఫికేషన్‌లను ఆటోమేటిక్‌గా పంపుతుంది. వాటిని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

  • ముందుగా మీ ఐఫోన్లోని వెదర్ యాప్ ని ఓపెన్ చేయండి.
  • వాతావరణ యాప్ ఇంటర్‌ఫేస్‌లో కింద కుడి మూలలో ఉన్న జాబితా చిహ్నంపై నొక్కండి.
  • అప్పుడు మీకు అదనపు ఆప్షన్లు కనిపిస్తాయి. ఆ ఆప్షన్లలో నోటిఫికేషన్‌లపై నొక్కండి.
  • అక్కడ నుంచి “సివియర్ వెదర్” పక్కన ఉన్న స్విచ్‌ను “ఆన్” చేయండి. ఇది వరదలతో సహా తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కోసం హెచ్చరికలను అనుమతిస్తుంది.
  • ఆ తర్వాత మీరు సివియర్ వెదర్ హెచ్చరికలను స్వీకరించాలనుకుంటున్న ప్రదేశాన్ని ఎంచుకోండి.
  • “అలర్ట్ టోన్”, “వైబ్రేషన్” లను ఎంచుకోవడం ద్వారా మీరు స్వీకరించే హెచ్చరికల రకాలను మరింత అనుకూలీకరించవచ్చు. తీవ్రమైన వాతావరణ హెచ్చరికల కోసం ప్రత్యేకమైన ధ్వని లేదా వైబ్రేషన్ నమూనాను సెట్ చేయడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది.
  • అయితే నోటిఫికేషన్‌లు ప్రముఖంగా కనిపించడం కోసం మీరు మీ లాక్ స్క్రీన్‌కి వాతావరణ విడ్జెట్‌ని జోడించండి.

ఆండ్రాయిడ్ లో అయితే ఇలా..

చాలా మంది ఆండ్రాయిడ్ ఫోన్ తయారీదారులు ఇన్ బిల్ట్ యాప్ లను అందిస్తున్నారు. కానీ చాలా తక్కువ ఫోన్లలో అవి ఉంటున్నాయి. అయితే గూగుల్ ప్లే స్టోర్ లో మీకు పలు యాప్ లు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో వెదర్ యాప్ ఒకటి. ఇది మీకు సమగ్ర వాతావరణ విషయాలను అందిస్తుంది. వరద హెచ్చరికలు, వర్షం సూచనలు నోటిఫికేషన్ల రూపంలో తెలియజేస్తుంది. అందుకోసం మీరు ఇలా చేయాలి..

ఇవి కూడా చదవండి
  • ఆండ్రాయిడ్ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి.
  • దానిలో వచ్చిన ఆప్షన్ల నుంచి కిందకి స్క్రోల్ చేసి నోటిఫికేషన్స్ అనే దానిపై ట్యాప్ చేయండి.
  • ఆ తర్వాత అడ్వాన్స్ డ్ లేదా మోర్ అనే ఆప్షన్ ని ఎంచుకోండి.
  • దానిలో ఎమర్జెన్సీ అలర్ట్స్ లేదా వెదర్ అలర్ట్స్ ను ఎంచుకోండి.
  • కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఈ నోటిఫికేషన్లకు రింగ్ టోన్ పెట్టుకొనే అవకాశం కూడా ఉంటుంది. సౌండ్, వైబ్రేషన్, ఎమర్జెన్సీ టోన్ వంటి ఉంటాయి. వాటిని సివియర్ వెదర్ అలర్ట్స్ కోసం పెట్టుకోవచ్చు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..