వాట్సాప్.. చిన్న స్టార్టప్ గా మొదలైన ప్రస్థానం నేడు ప్రపంచంలోనే నంబర్ వన్ మెసేజింగ్ యాప్ గా నిలిచే స్థాయికి చేరుకుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, వ్యాపార వేత్తలు ఇలా ఒకరేటిమి అందరికీ నేడు సమాచార మార్పిడికి బెస్ట్ చాయిస్ వాట్సాప్. టెక్ట్స్ చేయాలన్నా, ఫైల్ పంపాలన్నా, కాల్స్ చేయాలన్నా ఎక్కువగా వినియోగిస్తున్నది ఈ యాప్ నే. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మెటా యాజమాన్యంలోని యాప్ డెవలపర్స్ నిరంతరం కృషి చేస్తూ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉన్నారు. కొత్త ఫీచర్లు ఎన్ని యాడ్ అవుతున్నా వాట్సాప్ బేసిక్ రూపు మాత్రం ఏమి మారలేదు. వాట్సాప్ చాట్స్, స్టేటస్, కాల్స్ మనకు కనిపించే విధానంలో ఎటువంటి మార్పు చోటుచేసుకోలేదు. అయితే రానున్న కొత్త అప్ డేట్ లో దీనిపై యాప్ డెవలపర్స్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇకపై వాట్సాప్ నావిగేషన్ బార్ కింద కనిపించనుంది. ఈ మేరకు వాబీటా ఇన్ ఫో ఓ రిపోర్టును ప్రచురించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
వాబీటా ఇన్ ఫో నివేదిక ప్రకారం.. వాట్సాప్ కనిపించే తీరు లో మార్పు రానుంది. వాట్సాప్ ఓపెన్ చేయగానే మనకు పైన నావిగేషన్ బార్ లో చాట్, కాల్, స్టేటస్, కమ్యూనిటీ ట్యాబ్ లు మనకు కనిపిస్తాయి. దీనినే ఇప్పుడు మార్చడానికి యాప్ డెవలపర్స్ ప్రయత్నిస్తున్నారు. ఐఓఎస్ వెర్షన్ లో ఇదే నావిగేషన్ బార్ వాట్సాప్ కింది భాగంలో ఉంటుంది. ఇదే విధంగా ఆండ్రాయిడ్ వినియోగదారులకు కూడా నావిగేషన్ బార్ ని కిందకి తీసుకురానున్నట్లు చెబుతున్నారు. ఈ విధంగా మార్చాలని వినియోగదారులు చాలా కాలంగా కోరుతున్నారు. అందుకనుగుణంగా ఇప్పుడు ఈ మార్పును తీసుకురానున్నారు.
ఈ కొత్త అప్ డేట్ త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఇది వాట్సాప్ బీటా తాజా వెర్షన్(v2.23.8.4) గుర్తించారు. త్వరలో పూర్తి స్థాయిలో వినియోగదారులకు అందుబాటులోకి రావచ్చు.పెద్ద ఫోన్‌లను కలిగి ఉన్న వినియోగదారులను ఒక చేతిని ఉపయోగించి వివిధ ట్యాబ్‌లను నావిగేట్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ అప్ డేట్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉందని.. పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశాక వినియోగదారులకు అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ ఫో నివేదిక పేర్కొంది.
వాట్సాప్ వినియోగదారులకు మరిన్ని కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. వ్యక్తిగత చాట్ లను లాక్ చేయగల ఫీచర్ ఉంటుంది. ఐఫోన్ వినియోగదారులకు వీడియో సందేశాలు, వాయిస్ నోట్ లను స్టేటస్ అప్ డేట్ లుగా సెట్ చేయడం, కొత్త గ్రూప్ పార్టిసిపెంట్ ఆమోదించడం వంటి ఫీచర్లను తీసుకురానుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..