Aadhaar Linking: బ్యాంకు ఖాతాతో ఆధార్ లింక్ అయ్యిందా? ఇప్పుడే చెక్ చేసుకోండి.. లేకుంటే ఏ పథకం పొందలేరు..

|

Apr 27, 2023 | 4:30 PM

మీ ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాకు అనుసంధానం అయ్యిందో లేదో తనిఖీ చేసుకోవడం ముఖ్యం. దానిని ఎలా చేసుకోవాలి? బ్యాంకు వెళ్లాల్సిందేనా? అవసరమే లేదండి. మీరు మీ ఇంట్లోనూ కూర్చొనే ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ స్టేటస్ ను తనిఖీ చేయవచ్చు.

Aadhaar Linking: బ్యాంకు ఖాతాతో ఆధార్ లింక్ అయ్యిందా? ఇప్పుడే చెక్ చేసుకోండి.. లేకుంటే ఏ పథకం పొందలేరు..
Aadhaar Card
Follow us on

ఆధార్ కార్డు.. 12 సంఖ్యలతో ఉండే డిజిటల్ ఐడీ. మన దేశంలో ఉండే ప్రతి ఒక్కరికీ ఇది అవసరం. బ్యాంకు ఖాతా ప్రారంభించాలన్నా, సిమ్ కార్డు తీసుకోవాలన్నా.. రిజిస్ట్రేషన్ అయినా, ఏదైన ప్రభుత్వ పథకం కావాలన్నా ఆధార్ తప్పనిసరి. అయితే ఈ ఆధార్ ను పాన్ కార్డు, అలాగే బ్యాంకు అకౌంట్ నంబర్లతో లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. ముఖ్యంగా బ్యాంక్ ఖాతాతో ఆధార్ అనుసంధానం కాకపోతే ప్రభుత్వం అందించే ఏ ప్రయోజనమూ అందదు. అలాగే ఆదాయపు పన్నులకు సంబంధించి పనులకు, మొబైల్ వాలెట్ల వాడకానికి ఆధార్ కార్డు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. మరి అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. ఇలాంటి సమయంలో మీ ఆధార్ నంబర్, బ్యాంకు ఖాతాకు అనుసంధానం అయ్యిందో లేదో తనిఖీ చేసుకోవడం ముఖ్యం. దానిని ఎలా చేసుకోవాలి? బ్యాంకు వెళ్లాల్సిందేనా? అవసరమే లేదండి. మీరు మీ ఇంట్లోనూ కూర్చొనే ఆధార్, బ్యాంక్ అకౌంట్ లింక్ స్టేటస్ ను తనిఖీ చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి.

ఇది విధానం..

  • యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ www.uidai.gov.inకి వెళ్లాలి.
  • దానిలో ఆధార్ సర్వీసెస్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి.
  • దానిలో చెక్ ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్ అనే దానిని ఎంపిక చేసుకోవాలి.
  • ఆధార్ నెంబర్, సెక్యూరిటీ కోడ్‌ను నమోదు చేయాలి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది.
  • యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ఈ ఓటీపీని నమోదు చేయాలి
  • ఆ తర్వాత మీ ముందు లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • లాగిన్ అయిన తర్వాత, మీ ఆధార్ కార్డుతో లింకైన అన్ని బ్యాంకు అకౌంట్ల వివరాలు వస్తాయి.

లింక్ కాకపోతే ఇలా చేయండి..

  • మీ ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాతో లింక్ కాకపోతే ఇలా చేయాలి.
  • మీ ఖాతా ఉన్న బ్యాంకు అఫీషియల్ వెబ్ సైట్ లో లేదా, మీ బ్యాంకు బ్రాంచ్ ఆఫీస్ ను నేరుగా వెళ్లి ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు.
  • ఆధార్ నంబర్, పాన్ కార్డు డిటైల్స్ ఇవ్వాలి.
  • బ్యాంకు వారు ఇచ్చే ఆధార్ లింకింగ్ ఫారాన్ని పూర్తి చేసి సబ్ మిట్ చేయాలి.
  • బ్యాంకు వారు యూఐడీఏఐలో మీ ఆధార్ ను వెరిఫై చేసి బ్యాంకు ఖాతాకు ఆధార్ ను లింక్ చేస్తారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..